• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేసీఆర్ స్కెచ్ ఏమిటో చెప్పేసిన ర‌ఘునంద‌న్‌

admin by admin
January 30, 2022
in India, Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
293
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ‌లోనూ ఎన్నిక‌లు జ‌రిగితే త‌మ పార్టీకి ప్ర‌మాదం అని భావించిన కేసీఆర్ 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఘ‌న విజ‌యంతో రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు. ఈ సారి కూడా కేసీఆర్ అదే వ్యూహాన్ని అనుస‌రిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీలు అందుకు త‌గిన‌ట్లుగా సిద్ధ‌మ‌వుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముంద‌స్తు సూచ‌న‌ల నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌డం విశేషం. దీంతో తెలంగాణ‌లో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం హోరెత్తుతోంది. అయితే  కేసీఆర్ మ‌న‌సులో ఏముందో తాను చెప్తాన‌ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు అంటున్నారు. కేసీఆర్ స్కెచ్ ఇదేన‌ని ఆయ‌న ఓ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

గుజ‌రాత్‌తో పాటే తెలంగాణలోనూ ఎన్నిక‌లు జ‌రిగేలా కేసీఆర్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని కొంత‌కాలంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌ఘునంద‌న్ రావు కూడా ఇదే విష‌యాన్ని మ‌రోసారి నొక్కి వ‌క్కాణించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్ కేంద్రంపై కొట్లాట ఆపి రెస్టు తీసుకుంటార‌ని ర‌ఘునంద‌న్ చెప్పారు.

ఒక‌వేళ యూపీలో మాత్రం బీజేపీకి ఏమైనా ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తే మాత్రం కేసీఆర్ వెంట‌నే త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. గుజ‌రాత్‌తో పాటే ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని ర‌ఘునంద‌న్ జోస్యం చెప్పారు. గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ, అమిత్ షా ఎక్కువ‌గా దానిపైనే దృష్టి పెడ‌తార‌ని.. అప్పుడు తెలంగాణ‌పై శ్ర‌ద్ధ చూపే అవ‌కాశం ఉండ‌ద‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంద‌ని వివ‌రించారు.

అయితే యూపీలో బీజేపీ ఓడిపోతుంద‌న్న‌ది కేసీఆర్ భ్ర‌మ మాత్ర‌మేన‌ని ర‌ఘునంద‌న్ తెలిపారు. తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. త‌మ పార్టీకి అభ్య‌ర్థుల కొర‌త లేద‌ని టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీ బీజేపీనేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో బీజేపీ పుంజుకోవ‌డంతో ఇక్కడి రాజ‌కీయాల్లో త్రిముఖ పోటీ నెల‌కొంది.

ఓ వైపు కాంగ్రెస్‌.. మ‌రోవైపు బీజేపీ.. అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చూసి దూసుకెళ్తున్నాయి. వచ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. మ‌రోవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం సాగుతూనే ఉంది. దీంతో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు ఈ పార్టీలు సిద్ద‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఈ ఏడాది జ‌రిగే గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు బీజేపీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది.

Tags: BJPKCRRaghunandan RaoTelanganaTRS
Previous Post

తండ్రుల ఓట‌మికి ప్ర‌తీకారంగా కూతుళ్ల పంతం !

Next Post

వైసీపీపై మీసం తిప్పి వణుకు పుట్టించాడు… వీడియో వైరల్ !

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post
challa ramachandra reddy

వైసీపీపై మీసం తిప్పి వణుకు పుట్టించాడు... వీడియో వైరల్ !

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra