జాతీయ రహదారులకు సంబంధించి కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని పూర్తయ్యాయి. పెండింగ్ లో ఉన్నవి పూర్తి అయ్యేందుకు నిధులు కావాలి. ఎంపీ రాము చొరవతో అవి త్వరలోనే రానున్నాయి. అంతేకాదు శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ను మరింత ఆధునికీకరించే పనులకు ఇప్పటికే పలుసార్లు ఎంపీ తరఫున ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిలో కొన్ని కేంద్రం ఆమోదించింంది కూడా !
ఆ కోవలో నౌపడ లో స్టెయిన్ లెస్ స్టీల్ తో ఫుట్ ఓవర్ బ్రిడ్స్ ఏర్పాటైంది. దేశంలోనే మొదటి సారి ఓ రైల్వే స్టేషన్ లో చేసిన ఏర్పాటు ఇది అని చెబుతున్నారు రైల్వే శాఖ అధికారులు. దీని ఏర్పాటుకు కూడా ఎంపీ రామూనే చొరవ చూపి సుదీర్ఘ కాలంగా నెలకొన్న సమస్యకు ఓ పరిష్కారం చూపారు. సముద్ర ప్రాంతం కావడంతో ఉప్పుటేరు గాలులకు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం సంబంధిత నిర్మాణం నిలదొక్కుకునే విధంగా అత్యంత నాణ్యతతో ఈ పనులు చేపట్టారు సంబంధిత అధికారులు. పైకి ఇవి చిన్న చిన్న పనులుగానే కనిపించినా ఇవి కూడా తీర్చకుండా ఏళ్లకు ఏళ్లు కొన్ని ప్రభుత్వాలు కాలం గడిపేశాయి.
కానీ ఎంపీ రామూ అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఎన్నో సార్లు స్థానిక రైల్వే స్టేషన్ల అభివృద్ధి పై పార్లమెంట్ మొదలుకుని గల్లీ స్థాయి వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా తిరుపతి పోయే ట్రైనును కూడా సాధించారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఎప్పటి నుంచో ఇక్కడి ఆమదాలవలస స్టేషన్ నుంచి రైలు నడపాలని, ప్రత్యేక సర్వీసు నడపడం ద్వారా తాము కొంతలో కొంత ప్రయాణ భారం తమకు తగ్గుతుందని సంబంధిత శాఖకు భక్తులు విన్నవిస్తూనే ఉన్నారు. అదేవిధంగా సంబంధిత సంఘాలు కూడా ఎంపీ రామూను కలిసి సమస్య తీవ్రతను వివరించాయి. దీంతో ఎట్టకేలకు తిరుపతి వెంకన్న దర్శనానికి మార్గం సుగమం అయింది.
ఆ వివరం ఈ కథనంలో.. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించేందుకు యువ నాయకులకు కొదవే లేదు. అందుకే వీలున్నంత వరకూ యువ నాయకులనే ముందు వరుసలో ఉంచి ప్రజా ఉద్యమాలు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ లీడర్లకు సూచనలు అందిస్తుంటారు అధినేత చంద్రబాబు. అంతేకాకుండా పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న కుటుంబాల్లో ఒకటి కింజరాపు కుటుంబం. ఎర్రన్నాయుడు దగ్గర నుంచి ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు వరకూ పార్టీకి అండగా నిలిచినవారే ! ముఖ్యంగా రాష్ట్ర సమస్యలు దేశ రాజధాని స్థాయిలో వినిపించి, సంబంధిత పరిష్కారం కోసం కృషి చేసిన వారే !
ఇప్పటికే ఎన్నో సమస్యలపై పార్లమెంట్ వేదికగా గళం వినిపించిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు గతం కన్నా ఇంకా వేగంగా నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయ పరిచి మంచి ఫలితాలు అందుకునేందుకు పరితపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం పరిధిలో పరిష్కారానికి నోచుకోవాల్సిన విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కు సంబంధించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు.
సంబంధిత శాఖకు ఎన్నో లేఖలు రాశారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా, ప్రత్యేక జోన్ విషయమై సుదీర్ఘ కాలంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇవన్నీ పొలిటికల్ మైలేజ్ కోసం కాకుండా ఓ బాధ్యతగా ఆయన పనిచేస్తున్నారన్నది ఓ వాస్తవం. లోక్ సభలో ఆయనతో పాటు జయదేవ్, విజయవాడ నాని (కేశినేని నాని) పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మిగతా ఎంపీల కన్నా భిన్నంగా ఎంపీ రామూ పనిచేస్తూ, మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న కొన్ని రైళ్ల విషయమై ఇటీవలే ఆయన కేంద్ర ప్రభుత్వ వర్గాలతో సంప్రతింపులు జరిపారు.లేఖలు రాశారు. ఈక్రమంలో ఎప్పటి నుంచో జిల్లావాసుల ప్రతిపాదన అయినటువంటి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ ప్రత్యేక రైలు నడిపే విషయమై ఇటీవల సంబంధిత శాఖ అంగీకారం తెలిపింది. ఇదే సందర్భంలో రాము మరిన్ని ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఫలించడంతో జిల్లా వాసుల సుదీర్ఘ కల ఒకటి నెరవేరింది.
ఈ నేపథ్యంలో యువ ఎంపీ ఏమన్నారంటే.. శ్రీకాకుళం – తిరుపతి మధ్య రెండు నెలల పాటు ప్రత్యేక రైలును మంజూరు చేసినందుకు రైల్వే శాఖ వారికి ధన్యవాదాలు. ఈ సౌకర్యాన్ని శ్రీకాకుళం వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ తాత్కాలిక సదుపాయాన్ని శాశ్వతంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని చెప్పారాయన. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారాయన. దీంతో యువ ఎంపీ చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.