పార్లమెంటులో పాస్ చేసిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఇష్టం లేదని తెలిసి వాటిని ఉపసంహరించుకోవడమే గాకుండా స్వయంగా ప్రధాని మోడీ రైతులను క్షమాపణ కోరాడు. తప్పు ఒప్పుకుని మోడీ తన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. ఇగోకి పోలేదు. అదే పని జగన్ ఎందుకు చేయరు ? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలదీశారు.
జగన్ ది మోసపూరిత వ్యవహారం. ఇప్పటికీ ఆయనను నమ్మలేం. అమరావతి ఏకైక రాజధాని అని అధికారిక ప్రకటన చేసేవరకు వదిలేది లేదు. మా స్టాండ్ క్లియర్ … అమరావతియే ఏపీ రాజధాని. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచాక అమరావతి దిగ్విజయంగా కొనసాగుతుంది అని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పాడు.