తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శనివారం(అక్టోబరు 26) నుంచి ప్రారంభంకానుంది. ఇది ఈ ఏడాది చేపడు తున్న రెండో విడత సభ్యత్వ నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ సీనియర్లు, మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదును కేవలం టైం పాస్‌గా తీసుకోవద్దని.. మనసు పెట్టి చేయాలని ఆయన సూచించారు. కొందరు నామ్ కే వాస్తే.. అన్నట్టుగా చేస్తున్నారని చెప్పారు.
పార్టీ సభ్యత్వం అంటే.. ఆ వ్యక్తి పార్టీలో కీలక భాగస్వామి.. కార్యకర్త అనే విషయాన్ని విసదీకరించాలని సీఎం చంద్రబాబు సూచిం చారు. అన్ని విషయాలను చెప్పిన తర్వాత.. సభ్యత్వం నమోదు చేయించాలని.. ఏదో వచ్చారు కదా.. అని ఇచ్చేయడం కాద న్నారు. పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని..ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో వివరించాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక, రూ.100 కట్టి సభ్యత్వం తీసుకునే వారికి రూ.5 లక్షల వరకు ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. వ్యక్తులు మరణిస్తే.. రూ.5 లక్షల వరకు సాయం చేస్తారని తెలిపారు.
అదేవిధంగా కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగం, ఉపాధి కూడా చూపిస్తారన్న విషయాలను సభ్యుడిగా చేరే వ్యక్తికి వివరించాల ని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలను పెంచాలని పిలుపునిచ్చారు. కనీసం ఒక్కొక్క జిల్లాలో లక్ష మందిని చేర్చేలా చూడాలని చంద్రబాబు కోరారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక.. కొందరు గత రెండు నెలల కిందట చేపట్టిన సభ్యత్వ నమోదు విషయంలో లోటు పాట్లు కనిపించాయి. ఆన్లైన్ చానెళ్లు చేసిన సర్వేలో టీడీపీ సభ్యత్వం ఎందుకు తీసుకున్నారన్న దానికి కొందరు వ్యక్తులు.. ఏమో తెలియదని సమాధానం చెప్పారు. ఇది అప్పట్లో రచ్చగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాజాగా నాయకులను హెచ్చరించడం గమనార్హం.