టిడిపి పోటీ చేయాలి అనుకున్న టార్గెట్ MLA 145, MP 18.
ఆల్రెడీ జనసేన కి 24 ఎమ్మెల్యే 3 ఎంపీ ఇచ్చేశారు .. ఇక బీజేపీ కి మిగిలింది 6 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లు.
వైసీపీ కి ఫేవర్ గా వున్న ఎంపీ సీట్లు అరకు, తిరుపతి, రాజంపేట, కడప.
బీజేపీ పై నాలుగు తీసుకోవటానికి సిద్దంగా వుంటే నర్సాపురం తో పాటు ఇంకో ఎంపీ సీట్ ఇవ్వొచ్చు.
ఎన్ని సీట్లు ఇస్తారో కంటే ఏ సీట్లు ఇస్తారో అనేది చూడాలి మనం.
విష్ణు కుమార్ రాజు, కామినేని, ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి లాంటి వారికి సీట్లు ఇస్తే ఓటు Transfer జరుగుతుంది.
ఎంపీ లలో కూడా పురంధేశ్వరి, సత్యకుమార్, సుజనా చౌదరి, రత్నప్రభ లాంటి వారికి సీట్లు ఇస్తే ఓటు Transfer జరుగుతుంది.
ఇలా కాకుండా బీజేపీ లో వైసీపీ బ్యాచ్ కి (జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు) టిక్కెట్లు ఇస్తే డిపాజిట్ లు కూడా రావు.
బీజేపీ చేతిలో ఓట్లు లేవు , సిస్టమ్ మాత్రమే వుంది. 2019 లో చంద్రబాబు గారు సీఎం హోదాలో ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన విషయం మీలో ఎంతమందికి గుర్తుంది?
టిడిపి సీట్లు గెలిపించాలి .. బీజేపీ వాళ్ళు సిస్టమ్ కనీసం న్యూట్రల్ గా పనిచేసేటట్టు చూడాలి. అదే పొత్తు.
సిస్టమ్ న్యూట్రల్ గా తన పని చేసుకుంటే చాలు .. (2019 లో జగన్ కు చేసినట్టు TDP కి హెల్ప్ చెయ్యాల్సిన అవసరం లేదు) జగన్ కుప్ప కూలి పోతాడు.
జగన్ చేతిలో ఇప్పుడు నాయకులు లేరు , కార్యకర్తలు లేరు , ఓట్లు లేవు. అతని చేతిలో డబ్బు + సిస్టమ్ వుంది.
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదించిన దానికంటే ఇప్పుడు పదింతలు దోచుకొన్నాడు. డబ్బు వాడాలి అన్నా సిస్టమ్ చేతిలో వుండాలి.
చంద్రబాబు జగన్ దగ్గర నుంచి కార్యకర్తలు, నాయకులు, ఓట్లు ఇప్పటికే లాగేసాడు .. ఇక మిగిలింది సిస్టమ్ .. అది లాగెయ్యటానికే ఈ పొత్తు.
బీజేపీ తో పొత్తు లేకున్నా టీడీపీ / జనసేన గెలుస్తుంది కదా? నిజమే.
జనసేన తో పొత్తులేకపోయానా టీడీపీ గెలుస్తుంది కదా? అది కూడా నిజమే.
ఇక్కడ గెలవడం మాత్రమే ముఖ్యం కాదు. వైస్సార్సీపీ పార్టీ ని పూర్తిగా నిర్మూలిస్తేనే ఏపీ ప్రమాదం లోనుంచి బయటపడ్డట్టు. విధ్వంసానికి గురైన రాష్ట్రాని తిరిగి పునర్నిర్మించాలంటే తప్పదు మరి.
బీజేపీ పార్టీని నమ్మేదెలాఅనే డౌట్ రావొచ్చు. రాష్ట్రము లో జరిగిన విధ్వంసం లో వాళ్లు కూడా భాగమే కదా?
అది కూడా నిజమే.
పక్కన ఒరిస్సా నవీన్ పట్నాయక్ ఎన్డీయే లో చేరతున్నాడు ఈ రోజు. అది మోడీ, షా ల ‘చాణక్య’ నీతి. ఇటు పక్క తెలంగాణ లో నిన్నటిదాకా (ఎలక్షన్ ముందు దాకా) కేసీఆర్ కోసం సొంత పార్టీని, కేడర్ ను బలి చేసినోళ్లు, ఈ రోజు ఓడిపోయిన TRS ను డేకను కూడా దేకట్లేదు. 🤪 ఇది నేటి బీజేపీ.
రేపు జగన్ పరిస్థితి కూడా అదే. అందుకే పొత్తు.
వాళ్ళు కూడా బాబు గారిని నమ్మట్లేదు .. కేవలం కొన్ని ఎంపీ సీట్ల కోసమే ఇప్పుడు నమ్మినట్లు నటిస్తున్నారు.
అలాగే మీరు కూడా నమ్మండి. 🤪😂.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు వోట్ వెయ్యరు. అది కూడా నిజమే.
టీడీపీ కు వెయ్యరు సరే మరి ఎవరికి వేస్తారు??
మళ్ళీ వైస్సార్సీపీ కే నా? అంటే అటువంటి వాళ్లు బీజేపీ తో పొత్తు పేట్రుకోక పోయినా జగన్‌కే వేస్తారు 🤪
జగన్ కు వెయ్యడం ఇష్టం లేని వారు (టీడీపీ/జనసేన లేని చోట) నోటా/కాంగ్రెస్ కు వేస్తారు. దాని వల్ల మనకేమీ నష్టం లేదు 🤪
ఊరికే ఏది ఏదో ఊహించేసుకుని టెన్షన్ పడిపొకండి.🚴