‘తానా’ ఎన్నికల కోలాహలం రోజు రోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ‘తానా’ ఎందుకు,శుద్ధ దండుగ,ఈ మధ్య వింటున్నదంతా ఏమీ సంతోషకరంగా లేదనే వారు ‘తానా ‘తెలుగు వారికీ ,తెలుగు భాషకూ,తెలుగు సంస్కృతికీ ఎంత చేసిందీ,ఇంకా ఎంత చేయగలుగుతుందీ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ 44 సంవత్సరాలుగా ‘తానా’ మరియు ‘తానా ఫౌండేషన్’ చేసిన అనేక కార్యక్రమాలతో అనితర సాధ్యమైన ప్రగతి సాధించిందనేది మర్చిపోలేని,మెచ్చుకోదగిన పచ్చి నిజం.ముఖ్యంగా గత 12 సంవత్సరాలుగా ‘తానా టీం స్క్వేర్’ చేసిన,చేస్తున్నఅత్యవసర సేవల గూర్చి ఈ రోజు వివరిస్తున్నాము.
అమెరికాలో ఉన్న తెలుగువారికి ఏదైనా అకస్మాత్తు ఆపద సంభమిస్తే,ఆపదకు గురైనవారు,ఆప్తులు తీవ్ర భాధ గందరగోళంలో కాళ్లు చేతులూ ఆడని పరిస్థితుల్లో ,వారికి స్వాంతన చేకూర్చడానికి,దిశా నిర్దేశనం చేయడానికి అవసరమైతే ధన సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే ఎంతో ఊరట కలుగుతుంది.అటువంటివారికి ఏ విధంగా సహాయం చేయవచ్చు అనే విషయమై తెలుగు వారి అతి పెద్ద సంస్థ అయిన ‘తానా’ చేసిన తీవ్ర ప్రయత్నాలనుంచి అప్పటి ముఖ్య నాయకుడైన ‘మోహన్ నన్నపనేని’ ‘బ్రెయిన్ చైల్డ్ ‘గా తానా టీం స్క్వేర్ (TANA Emergency Assistance Management TEAM) 2008 సంవత్సరం అక్టోబర్ 6 న మొదలైంది.దీనిని ప్రభావవంతంగా మలచడంలో కావలసిన సమాచారం కొరకు,విధాన పరమైన కార్యాచరణ కొరకు, దేశవ్యాప్తంగా అవసరమైన వాలంటీర్ల నియామకం కొరకు,వారికి తగిన శిక్షణ కొరకు ‘మోహన్ నన్నపనేని ‘చేసిన అకుంఠిత కృషి,పట్టుదల మరియు వెచ్చించిన విలువైన సమయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు.’తానా టీం స్క్వేర్’, ‘మోహన్ నన్నపనేని’ ఒకదానికొకటి ప్రత్నామ్యాయ పదాలుగా చెప్పుకొనే విధంగా కష్టపడుతూ విజయవంతం చేశారు.అతి కొద్ది కాలంలోనే ఈ సేవలు పొందిన వారి మరియు వారి ఆప్తుల ద్వారా వచ్చిన వివరణలతో ఇది ఎంతో కష్టతరమైన గొప్ప సేవ అని తేలి,సమాజానికి ఎంతో అవసరమని కూడా అర్ధమైంది.దీనిని మరింతగా మెరుగు పరచి విస్తరించాల్సిన సమయంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన ‘మోన్ నన్నపనేని ‘కు బలమైన తోడు గా 2011 నాటికి ప్రస్తుత ‘తానా ‘ప్రెసిడెంట్ ఎలెక్టు ‘అంజయ్య చౌదరి లావు ‘జత కల్సి ‘తానా టీం స్క్వేర్’ అంటే అమెరికా తెలుగు వారి ‘911’ వ్యవస్థ అనే విధంగా మారి పోయేటట్లు తీర్చిదిద్దారు.ఈ మధ్యలో ఎన్నో సవాళ్లు,వలంటీర్ల కొరత, వైట్ బ్లాంకెట్ గాళ్లు అనే ఎగతాళ్లు,ఆర్ధిక లోట్లు వంటివి ఎన్నో భరించి కూడా,ఈ ఇద్దరికి తోడు అనేకమంది కలసి రాగా,త్వరలోనే మొత్తంగా ‘తానా ‘లీడర్షిప్ ఈ కార్యక్రమాన్నితమ ఫ్లాగ్షిప్ కార్యక్రమం గా మార్చుకొంది.అనేక ఇతర పదవులతో పాటుగా ‘అంజయ్య చౌదరి లావు’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా తక్కువ సమయంలోనే ఎన్నిక కావడానికి ‘టీమ్ స్క్వేర్’ ద్వారా అయన చేసినసేవ,గుర్తింపు,నాయకత్వం ముఖ్య కారణంగా చెప్పవచ్చు.దీర్ఘ కాలం ‘టీం స్క్వేర్ ‘చైర్ పర్సన్ గా,ముఖ్య మెంటార్ గా ఉంటూ, ప్రస్తుతం కూడా ప్రధాన భాద్యతగా ‘అంజయ్య చౌదరి లావు’ఉన్నారు.ప్రమాదాలను నివారించుకోవడానికి,అమెరికా చట్టాలప్రకారం భాద్యతగా మెలగడానికి, సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి వివరిస్తూ ‘తానా’ గత అధ్యక్షులైన ‘మోహన్ నన్నపనేని ‘మరియు ‘Dr.జంపాల చౌదరి’ తానా వెబ్ సైట్ లో ఉంచిన 6 పేజీల డాక్యుమెంట్ ఏంతో ఉపయుక్తంగా ఉంది.సమాజం లో ‘తానా’ పై ఉన్న దృక్ఫదాన్నే ఎంతో పాజిటివ్ గా మార్చిన ‘తానా టీ స్క్వేర్ ‘ప్రోగ్రాం కు శుభాభినందనలు తెలియచేస్తూ,’మోహన్ నన్నపనేని’ మరియు ‘అంజయ్య చౌదరి లావు’తో పాటు,ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన వాలంటీర్లందరికీ ‘నమస్తే ఆంధ్ర’ జేజేలు పలుకుతోంది.
స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకు అనేక వేల మంది అమెరికాలో నివసించే లేదా పర్యటించే భారతీయులకు,ముఖ్యంగా తెలుగు వారికి ప్రమాదాలు గాని, హత్యలు (వ్యక్తుల వలన,కాల్పులు,రేసిజం వగైరా) గాని,ఆత్మహత్యలు గాని, వ్యాధుల వలన గాని,నీటిలో మునకల వలన గాని మారే ఇతర కారణాల వలన గాని మరణాలు సంభవించినప్పుడు,ఫైర్ ఆక్సిడెంట్ లు జరిగినప్పుడు, నయంకాని జబ్బులతో బాధ పడుతున్నప్పుడు,యూనివర్సిటీ చదువుల్లో ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు వచ్చినప్పుడు,తీవ్ర న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు,ఆర్థికపరంగాను,మానసిక ధైర్యం కలిగే విధంగాను,డెడ్ బాడీస్ ను స్వదేశం వీలైనంత త్వరగా చేర్చే పరంగాను చేసిన సేవల విలువ ఏ విధంగానూ వెల కట్టలేనిది,ఋణం తీర్చలేనిది.ఇప్పటి వరకు రమారమి 5వేలు ఎమర్జెన్సీసేవలు,సుమారు 1000 మరణాల తదనంతర సేవలు, 2500 మంది విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సేవలు మొదలైనవి చేశారు.ముఖ్యంగా బేబీ శాన్వి హత్య సమయం,సెయింట్ లూయిస్ ఆక్సిడెంట్,కాన్సాస్ రేసిజం మరణం, అలస్కా గోల్డ్ స్పాట్ మూర్తి గారి ఆక్సిడెంట్,అట్లాంటా ఫైర్ ఆక్సిడెంట్ వగైరాలు ఇంకా మన స్మృతుల్లో మెలుగుతూనే ఉన్నాయి.ప్రతి వారం సుమారు 3కేసులు వరకు కొత్తగా వస్తుండడం ఈ కార్యక్రమం పై ప్రజలకు ఉన్ననమ్మకంగా చెప్పవచ్చును.ఇటువంటి సేవలను విస్తృతమైన వాలంటీర్ నెట్వర్క్ తో నిర్వహిస్తూ అమెరికా తెలుగు ప్రజలకు ‘తానా టీం స్క్వేర్ ‘ఆపదలో ఆపన్న హస్తంగాను,ఒక ప్రత్నామ్యాయ ‘911’ వ్యవస్థగాను ధైర్యం కలిగిస్తుందని చెప్పవచ్చును. 20వ దశాబ్దం తొలి నాళ్లలో ‘తానా’ కు ఎదురైన చేదు అనుభవాల్ని,అపఖ్యాతిని సమూలంగా తుడిచిపెట్టి పైన వివరించిన విధంగా ‘తానా టీం స్క్వేర్ ‘ద్వారా చేసిన సేవల ద్వారాను,అదే సమయంలో ‘దిలీప్ కూచిపూడి’, ‘జయ్ తాళ్లూరి’, ‘శ్రీనివాస గోగినేని’ ఆధ్వర్యంలో ‘తానా ఫౌండేషన్’ చేపట్టిన అనేక వినూత్న సేవ కార్యక్రమాల మూలంగాను ‘తానా’ ఒక బంగారు చరిత్రను తిరిగి సృష్టించిందని చెప్పవచ్చు.
అందుకే ‘తానా’ సంస్థ తెలుగు జాతికి ఒక వరంగా అంతకు మించి ఒక అవసరంగా మారింది,అందువలననే ఆ సంస్థలో జరిగే ఎన్నికలు సందర్భంగా తెలుగు వాళ్ళందిరిలో ఆసక్తి కలుగుతూంది.ప్రతిభావంతమైన నాయకత్వం రావాలని కోరుకొంటున్న ఈ ఎన్నికలలో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. ‘నరేన్ కొడాలి ‘-‘నిరంజన్ శృంగవరపు’వర్గాల మధ్య ఇంకా పోటీ నివారణ ప్రయత్నాలు జరుగుతున్నా,బయట జరిగే విషయాలు చర్చలు కొలిక్కి తెచ్చే విధంగా ఏమీ లేవు.గత వారము డి సి కాన్ఫరెన్స్ విషయమై బోర్డ్ లో 5 గంటల చర్చ తరువాత కూడా ఆమోదించకుండా తిరిగి ఈ వారము చర్చకు నిర్ణయించడం, దానికై లూబీయింగ్ గు డి సి నాయకుడు ‘లావు బ్రదర్స్ ‘ను ప్రసన్నం చేసుకోడానికన్నట్లు మరోసారి అట్లాంటా ప్రయాణం, ‘నరేన్ కొడాలి’ బే ఏరియా ప్రయాణం ఏ ఫలితాన్నిచ్చాయో త్వరలోనే తెలుస్తుంది.అట్లాంటా ‘లావు బ్రదర్స్ ‘కూడా ఈ రెండు వర్గాల మధ్యలో ఎటు వైపు మొగ్గు చూపినా బలమైన రెండో వర్గంతో ఎటువంటి ఘర్షణ తలెత్తుతుందో అనే ఆలోచనలో పడ్డట్టు వీలైనంతవరకు బాలన్స్ చేసుకోవటమే తమకు శ్రేయస్కరమని భావిస్తున్నట్టు భోగట్టా.
ఈ మధ్యలో డీలా పడిన వర్గానికి బూస్ట్ చేయడానికన్నట్లు పోటీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా పేస్ బుక్ ద్వారా అర్దముగాని భాషలో ‘నరేన్ కొడాలి’తెలపడం చర్చకు దారి తీసింది.ఇంకా ‘నిరంజన్ శృంగవరపు’ చెప్పుకుంటున్న లక్ష డాలర్స్ విరాళం గురించి ‘విద్య గారపాటి’ చేస్తున్నఆరోపణలపై బోర్డు నిర్ణయం గురించి ‘నిరంజన్ శృంగవరపు’ ను సంప్రదించగా,బోర్డు దానిని చాలా తేలికగా తీసుకుంటమే కాకుండా,తననే ఆయనపై ఎదురు ఆరోపణ చేస్తే,చర్య తీసుకొనే అవకాశమున్నట్లుగా చర్చించినట్లు చెప్పారు.అదే సమయంలో విరాళం వివరాలపై ప్రశ్నలను కొనసాగిస్తూ,’విద్య గారపాటి’ వరుసగా 4 వ వీడియో మెసేజ్ కూడా పెట్టటంతో ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుందోనని కూడా చర్చ సాగుతోంది.ఎటువంటి చర్చలకు అవకాశం లేదంటూ క్లారిటీ గా ఉన్న’శ్రీనివాస గోగినేని’ తనదైన పంధాలో మద్దతు సమీకరించుకుంటూ న్యూట్రల్ ఇమేజీతో సాగిపోతుండగా ఎక్కువమంది సాధారణ సభ్యులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈయనే బెటర్ అనే అభిప్రాయానికి వస్తున్నట్లు తెలుస్తోంది.ఈ గందర గోళంలో ఏ ప్యానెల్ మిగతా అభ్యర్థులను ప్రకటించలేదు కానీ జనవరి 31న ఎన్నికల షెడ్యూల్ రానున్నదున ఒక్కసారిగా వ్యవహారాలు జొరందుకోవచ్చును.