'తానా'ఎన్నికలు-చదరంగపు ఎత్తులా? వైకుంఠపాళి జిత్తులా??

ఈ రోజు జరుగుతున్న'తానా' బోర్డు మీటింగ్ తర్వాత 'తానా'ఎన్నికల షెడ్యూల్ రానున్నందున ఎన్నికల రణానికి సిద్ధమవటం లో భాగంగా అనేక పరిణామాలు చకచకా సాగుతున్నాయి. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాత్ర వహించేవాారు తమదైన విలక్షణ విధానంతో ఎత్తులు, జిత్తులు తో పాటు పైఎత్తులు కూడా ప్రయోగిస్తుండడం మూలంగా సాధారణ సభ్యులకు,తెలుగు కమ్యూనిటీ కు కొంత ఉత్సుకత,ఆసక్తి తో పాటు వినోదంకూడా కలుగుతోంది.వివిధ వర్గాలనుంచి గత వారం రోజులుగా సేకరిస్తూ వచ్చిన సమాచారంలో అన్ని వర్గాలు ప్రయోగిస్తున్న ఎత్తులు జిత్తులు అర్ధమవుతున్నట్లే ఉంది.
'నరేన్ వర్గం' నాయకుల్లో పెద్దాయిన 'నరేన్ 'కు పేస్ బుక్ ద్వారా బహిరంగ మద్దతు తెలపటం దేశవ్యాప్తంగా ఆ వర్గానికి సమరోత్సాహం కలిగించింది,మరియు విజయం సాధిస్తామనే ధైర్యం కూడా కలిగించింది. ఇంతేకాక వెన్నుపోటు పొడిచిన వారికి తగిన గుణపాఠం చెప్పటం ఖాయమని,ఈ విషయమై బే ఏరియాలో పెద్దాయనకు మద్దతు క్రమక్రమంగా గణనీయంగా పెరుగుతోందని చెప్పుకుంటున్నారు.అయితే సాధారణం గా సర్దుబాటు చేసే పనిలో ముఖ్యుడైన ఆయనే బహిరంగ మద్దతు తెలపటం మూలంగా ఇక అటువంటి హోదాకు నైతికంగా దూరమైనట్లే భావిస్తున్నారు.
'నిరంజన్ శృంగవరపు' చెప్పుకుంటున్నలక్ష డాలర్ల విరాళంపై వివరాల గూర్చి 'నరేన్ వర్గం' నుంచి వచ్చిన వీడియో మెసేజీల వ్యవహారం ఆయనను ఇరుకున పెట్టేటట్లు గానే ఉంది.ఈ విషయమై  మెసేజ్ లుపెట్టిన 'విద్యా గారపాటి' ను 'నమస్తే ఆంధ్ర' ప్రశ్నించగా అయన  9 నెలలక్రితమే 'తానా' బోర్డును ఇదే విషయమై ప్రశ్నించి ఉన్నప్పటికీ ,ఖాతరు చేయకుండా ఇప్పుడు ఎన్నికలలో కూడా తిరిగి ప్రస్తావిస్తూ ప్రచారం చేసుకోవడంపై నైతికంగాను, విధనాపరంగాను పెద్ద తప్పని భావిస్తున్నానని,ఇదే విషయమై ఆయనను పోటీ కి అనర్హుడుగా ప్రకటించాలని, లేదంటే తాను లీగల్ తలుపు తడతానని బోర్డు కు తెలియజేసానని చెప్పారు.
'నమస్తే ఆంధ్ర' సేకరించిన సమాచారం ప్రకారం ఈ లక్ష డాలర్లు 'నిరంజన్ 'కు ఎట్టి  సంబంధం లేని ప్రముఖ టెెక్నాలజీ కంపెనీ నుంచి వచ్చిందని,ఇది చిలికి చిలికి రభస అవుతుందేమోనని, కొంతమందికి ఇబ్బంది కూడా కలిగించవచ్చని భయపడుతున్నారు.ఈ గందరగోళం నుంచి 'నిరంజన్ 'ను కొంత బయటకు వేయటానికై అన్నట్లు 'తానా' ప్రెసిడెంట్ 'జయ్ తాళ్లూరి' ఫేస్ బుక్ ద్వారా 'నిరంజన్' అభ్యర్దిత్వానికి బహిరంగ మద్దతు ప్రకటించారు.అందరికీ జవాబుదారీ అయిన ప్రెసిడెంట్ పదవిలో ఉండి,ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన భాద్యత కలిగి కూడా ఎన్నికలలో ఒక అభ్యర్థికి అనుకూలంగా బహిరంగంగా ప్రకటించడం నైతికంగా తప్పని,అమెరికా వ్యాప్తంగా అనేకమంది భావిస్తున్నారు.
ఇలా ఉండగా ఎన్నికల విధానాన్ని అత్యంత పారదర్శకంగా ఉండేలా 'తానా' బోర్డ్ నిర్వహించాలని కోరుతూ చాలా కాలం 'తానా' బోర్డు లో కూడా పనిచేసిన ప్రస్తుత ప్రెసిడెంట్ అభ్యర్థి 'శ్రీనివాస గోగినేని' అనేక సూచనలు వివరిస్తూ ఓపెన్ లెటర్ 'తానా 'లీడెర్షిప్ నకు వ్రాసారని,  దానిని బోర్డు పరిగణన లోనికి తీసుకొని ఎన్నికల విధానాన్ని సవరిస్తున్నట్లు సమాచారం.ఇదే జరిగితే ఎన్నికలు పారదర్శకంగా జరిగి అభ్యర్థులందరికీ సమాన న్యాయం జరుగుతుందని భావించొచ్చు.
'నరేన్ కొడాలి' వర్గం ,'నిరంజన్ శృంగవరపు' వర్గాలమధ్య అవగాహనకి జరిగిన ప్రయత్నాలు ఎటువంటి ఫలితాల్ని ఇవ్వకపోగా,ఇరు వర్గాల కింది స్థాయి కార్యకర్తలందరిలో గందరగోళం సృష్టించింది.ముఖ్యంగా ఇప్పటికే అసంతృప్తి గా ఉన్న 'నరేన్' వర్గ ప్రముఖుడు 'రవి పొట్లూరి' అసహనానికి లోనై తానే పోటీకి దిగుతానని మీరు కావలంటే రాజీ చేసుకోండని ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర స్థాయిల్లో కార్యకర్తలు మద్దతు సమీకరించే పనిలోఉండగా,పై స్థాయిలో రాజీకి వెళుతున్నారనే విషయం తెలిసి చాలామంది 'నరేన్' వర్గీయులు నిరుత్సాహానికి గురైనారు.ఈ విషయాన్ని గమనించిన వర్గ ప్రముఖులు డి.సి నాయకున్ని హుటాహుటిన 'రవి పొట్లూరి'వద్దకు పంపగా ఆయన్నిబుజ్జగించి, పూర్తి ప్యానెల్ ఏర్పాటు గురించి కూడా చర్చించి సమాధానపరచినట్లు తెలుస్తోంది.కాగా వివరాలకై ప్రయత్నించిన 'నమస్తే ఆంధ్ర'కు 'రవి పొట్లూరి' అందుబాటులోకి రాలేదు.
అయితే ఇదంతా 'నరేన్' వర్గ ప్రముఖులకు ప్రావీణ్యమున్న చేయి తిరిగిన వ్యూహమని,మెల్లిగా ముగ్గులోకి దింపి క్రమంగా లొంగదీస్తారని,ఆ విషయాన్నిఇదే గుంపులో గోవిందలైన 'నిరంజన్ వర్గం 'గ్రహించి అలవి శక్యం గాని మెలికలతో సాగదీస్తూ అవతలి వర్గాన్ని నైతికంగా బలహీనం చేస్తున్నారని తెలిసింది. దీనితో 'నరేన్ వర్గం'నించి పల్టీ కొట్టిన వారి వల్లే ఇదంతా జరుగుతోందని వారిపై కోపగించుకొంటున్నారు.అలాగే 'నిరంజన్ వర్గం' నుంచి కొందరు త్వరలో తమతో కలుస్తారని చెప్తున్నారు.కానీ కరోనా వైరస్ మూలంగా తాము నమ్ముకుంటున్న బాలట్ కలెక్షన్ కష్టతరమని,ఇరువర్గాలకు నష్టమేనని,పైగా బాలట్ కలెక్షన్లను తీవ్రంగా వ్యతిరేకించే 'గోగినేని'వర్గానికి వరమని,అందుకే ఎదో విధంగా ఇరువర్గాలను కలపడం ద్వారా ఎలెక్షన్ ఫలితాలపై ఉన్న భయాన్ని దూరం చేసుకోవచ్చని రెండు వర్గాలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కొంతమంది వాదన.
ఇక అట్లాంటా 'లావు బ్రదర్స్ 'ఇప్పటివరకు ఏ చింత లేకుండా గాలి మేఘాలలో విహరిస్తూ చేసుకుంటున్న 'హనీమూన్' అంతమైనట్లుగా తెలుస్తోంది.చాలా కాలంగా ఇదే రెండు వర్గాలతో కలసి మెలసి ప్రయాణించి,తమ పబ్బం గడవగానే ఆంటీ ముట్టకుండా ఉంటూ ఎదో  ఒక వర్గానికి అంతర్లీనంగా ఆశీస్సులివ్వడం, అదే విధానంగా చివరివరకు సాగించడం అంత తేలిక కాదని అర్ధమైనట్లుంది.
తమ వర్గానికి మద్దతు తెలపకుండా నెట్టుకొస్తున్న విషయంలో ఒత్తిడి తేలేకపోతున్నప్పటికీ ,అవతలి వర్గం అప్పుడప్పుడూ ఇస్తున్న లీకులతో వారి వైపు మొగ్గు ఏమైనా ఉందేమోననే అనుమానంతో డి సి నాయకుణ్ణి అట్లాంటా పంపినట్టు, అయన తనదైన విధానం లో ఎంట్రీ ఇచ్చి మద్దతు కోరినట్లు,విషయ తీవ్రత అర్ధమయేటట్లు చెప్పుకున్నట్లు సమాచారం.ఇప్పుడు ఈ రెండు వర్గాల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా 'కరవమంటే కప్పకు కోపం,విడవమంటే పాము కు కోపం' చందంగా తయారై 'ముందు నుయ్యి వెనక గొయ్యి' అని తెలిసి పోయి మధ్యస్థంగా ఉండటమే బెటర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఎలక్షన్ వ్యవహారంలో  తీవ్ర రాగ ద్వేషాలను రెండు వర్గాలకు కలిగించొచ్చని, అది అంతిమంగా వచ్చే రెండు సంవత్సరాలు సంస్థను నడపాల్సిన తమకు ఓడిపోయిన వర్గం నుంచి వచ్చే సమస్యలు మూలంగా కష్టతరం కావొచ్చని భయపడుతున్నట్లు సమాచారం.పైగా ఇప్పుడు తమకు కావలసిన వారికి అవసరమైన పదవుల విషయమై కూడా ఏ విధంగా వ్యవహరించాలనే విషయం లో తర్జన భర్జన పడుతున్నట్లు,అందుకే ఏదైనా 'రాజీ 'అయితే తలనొప్పి పోతుందని కోరుకొంటున్నారు.
ఇంకా 'శ్రీనివాస గోగినేని'పై పెద్దగా  నెగటివ్ విషయాలను 'నమస్తే ఆంధ్ర' రాయలేదని మిగతా రెండు వర్గాలలో కొందరు అడిగినప్పుడు,వారి దృష్టి లో ఉన్న విషయాలను చెపితే తప్పకుండా పాఠకులకు తెలియజేస్తామని చెప్పింది.ఈ  విషయంపై రెండు వర్గాలు ఒకే రకమైన ఆరోపణను 'శ్రీనివాస గోగినేని'పై చేసారు.రెండవ వర్గానికి నష్టం కలిగించడానికి మొదటి వర్గం లోని నాయకులు పోటీకి ఉసిపోల్పారని రెండో వర్గం వారు,రెండవవర్గానికి నష్టం జరుగుతుందని తామే పోటీ కి ఉత్సహపరిచామని మొదటి వర్గం చెప్పుకుంటున్నారు.ఈ  విషయంపై 'శ్రీనివాస గోగినేని' ని వివరణ కోరగా తీవ్రంగా ఖండిస్తూ ,రెండు వర్గాలు ఒకే తాను ముక్కలని,ఇప్పటివరకు ఒకే గుంపుగా ఉండి కొత్తగా అధికారంకోసం తన్నుకుంటున్న వారు ఇదికాక ఇంకేం చెప్తారని,మరి ఇదే రెండు వర్గాలు కలగలసి మంది బలంతోను, ధనబలంతోను చేసిన 2017 ఎలెక్షన్లలో తాను స్వంత ఖర్చుతో వీరి ఆగడాలపై ప్రశ్నిస్తూ, పోటీ చేసినప్పుడు ఏ వర్గం తనను ఉసికొల్పారని ఎదురు ప్రశ్నించారు.ఈ సారి ఎన్నికలలో తనకు వస్తూన్న స్వచ్ఛంద మద్దతు పై భయంతోనూ,తాను నిర్భయంగా రెండు వర్గాలను ప్రశ్నిస్తూ ఢీ కొడతానని భయంతో,తనకున్నవిజయావకాశాల మూలంగా ఇప్పుడు మళ్ళీ కలసిపోడానికి ప్రయత్నిస్తూ,వేరే ఏమీ లేక ఇటువంటి తప్పుడు ఆరోపణలను చేస్తున్నారన్నారు.
ఇంకా 2019 లో 'లావు అంజయ్య చౌదరి' పై పోటీ  చేయకుండా మరి 2021 లోనే పోటీ ఎందుకు చేస్తున్నారని రెండు వర్గాలు ప్రశ్నిస్తుండగా,అదే విషయాన్ని 'శ్రీనివాస గోగినేని' ని 'నమస్తే ఆంధ్ర' అడిగింది.అంతకు ముందు 12 సంవత్సలపాటు నిర్విరామంగా 'తానా 'సంస్ధ కోసం పనిచేసి,చివరిగా ప్రెసిడెంట్ గా పోటీ కూడా చేసి అలసిపోయానని,ఆర్థికపరంగా,కెరీర్ పరంగా,ఫామిలీ బాధ్యతల పరంగా చాలా నష్ట పోయానని అదే సమయంలో అందరివాడు,వివాదాలు లేని మంచి మిత్రుడైన 'అంజయ్య చౌదరి' తానూ 2019, 2021 లో వరుసగా పోటీ చేస్తూ సహకరించు కోవాలని అనుకున్నామని,మాటకు కట్టుపడి,వేరే విషయంగా పరిస్థితులు మారి పోటీ చేసే అవకాశం అనుకోకుండా వచ్చినప్పటికీ, 2019 లో పోటీ చేయలేదని,ఇప్పుడు పోటీ చేస్తున్నతన విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో అయిన ఏంచేస్తారు అనే విషయం ఖచ్చితంగా తెలియదని, 2019 పోటీ వ్యవహారం తెలిసిన ఆయన మరియు అయన మిత్రబృందం తనకు సహకరిస్తారని మనఃస్ఫూర్తిగా నమ్ముతున్నానన్నారు.తాను గెలిస్తే 'తానా' సంస్థ మంచి భవిష్యత్తు కోసం తదుపరి ప్రెసిడెంట్ 'లావు అంజయ్య చౌదరి' తో పాటు కలసి పని చెసి మెప్పిస్తానని 'గోగినేని' అన్నారు.
చివరిగా రాజీ ప్రయత్నాల గురించి 'నిరంజన్ శృంగవరపు'ను అడుగగా,వాటికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వడంలేదని,తాము అనుకున్న ప్యానెల్ తోనే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమై ఉన్నామని,ఒక వ్యూహంతోనే మిగతా ప్యానెల్ను ప్రకటించడం లేదని చెప్పారు.
'నరేన్ కొడాలి'వర్గ సమాచారం ప్రకారం వారి ప్యానెల్ సంచలన అభ్యర్దులతో పోటా పోటీ గా త్వరలోనే ప్రకటిస్తారని, తర్వాత దిమ్మదిరిగే విధంగా ప్రచారం ఉంటుందని చెప్తున్నారు.
పై వివరాలన్నిటిని గమనిస్తే మన 'తానా' నాయకుల శక్తియుక్తుల మీద మనందరం సంతోషపడవలసిన విషయమే.ఇక అందరి కోసం మనం ఈ క్రింద  పాట పాడుదామా?
'జయమ్ము నిశ్చయమ్మురా,భయమ్ము లేదురా,జంకు గొంకు లేక సాగి పొమ్మురా ! జంకు గొంకు లేక సాగి పొమ్మురా !'
బ్రేకింగ్ న్యూస్-‘తానా‘ఎన్నికల గందరగోళం-‘రవి పొట్లూరి’కూడా ప్రెసిడెంట్ అభ్యర్థి గా బరిలోకి..
మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న ‘తానా‘ఎన్నికల సమరభేరి ‘రవి పొట్లూరి’ కూడ ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది.
‘తానా‘సంక్రాంతి-బెట్టింగ్ బంగార్రాజులకు పండగే-ఎన్నికల కయ్యానికి కాలు దువ్విన ‘పుంజులు’
‘తానా’ ఎన్నికలవిషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,‘తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.