అమెరికా తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు,’తానా’ మాజీ అధ్యక్షులు ‘గంగాధర్ నాదెళ్ల’ నిన్న ఆకస్మిక అనారోగ్యంతో వెస్ట్ బ్లూమ్ ఫీల్డ్ ఫోర్డ్ హాస్పిటల్ లో చికిత్సకు చేరినట్లు తెలిపాము. ప్రస్థుతము అయన స్వస్థతతో ఇంటికి తిరిగి వచ్చారు. ‘నమస్తే ఆంధ్ర’తో మాట్లాడుతూ ప్రస్తుతం భయపడే విషయమేమీ లేదనీ విర్టిగో, అధిక రక్తపోటు మూలంగా నిన్న అకస్మాత్తుగా అస్వస్థత పాలైనప్పటికీ, వెంటనే కోలుకున్నానని, హాస్పిటల్ వారు అన్నిరకాల పరీక్షల చేసిన తరువాత అంతా బాగుందని డిశ్చార్జ్ చేశారన్నారు. తన ఆరోగ్యం గురించి కేర్ మరియు స్వస్థత కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ‘గంగాధర్ నాదెళ్ల’ స్వస్థతతో ఇంటికి తిరిగి రావడంపై అయన ఆప్తులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.