ఉత్కంఠభరితంగా సాగుతోన్న ‘తానా’ ఎన్నికల్లో ‘నరేన్ కొడాలి’కి ‘తానా’ మాజీ అధ్యక్షుడు మరియు ‘తానా టీం స్క్వేర్’ రూపకర్త ‘మోహన్ నన్నపనేని’ మద్దతు ప్రకటించారు.
‘తానా’ ఎన్నికల్లో ‘శ్రీనివాస్ గోగినేని’ పోటీ నుంచి తప్పుకొని ‘నరేన్ కొడాలి’కి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ‘మోహన్ నన్నపనేని’ కూడా ‘నరేన్ టీం’కు మద్దతు తెలపడం విశేషం.
కొంత కాలంగా ‘తానా’ రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ‘మోహన్ నన్నపనేని’ గతంలో ‘నరేన్ కొడాలి’తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ‘తానా’కు ‘నరేన్ కొడాలి’ వంటి వారి నాయకత్వం అవసరమని భావిస్తున్నానని ‘మోహన్ నన్నపనేని’ అన్నారు.
ఈ క్రమంలోనే తనకు, తన టీంకు మద్దతు ప్రకటించిన ‘మోహన్ నన్నపనేని’కి ‘నరేన్ కొడాలి’ ధన్యవాదాలు తెలిపారు.
తనపై, తన టీంపై ‘మోహన్ నన్నపనేని’ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
తాజాగా మో’హన్ నన్నపనేని’మద్దతులో ‘కొడాలి’ శిబిరంలో నూతనోత్సాహం కనిపిస్తోంది.
ఫ్లాష్ ! ఫ్లాష్ !! ‘తానా’ ఎన్నికల్లో ‘గోగినేని’ మద్దతు ‘నరేన్ కోడాలి’ కే!!