‘తానా’ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13 కల్లా నామినేషన్లు ఎలక్షన్ కమిషన్ వద్దకు చేరవలసిన కారణంగా అభ్యర్థులు బిజీబిజీగా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఎన్నికలు లేకుండా పదవులు పొందే సర్దుబాటు అలవాటు కారణంగాను, నామినేషన్ ఫీజు అత్యధికంగా ఉన్న కారణంగానూ, ఖచ్చితంగా పోటీ జరిగే మూలంగాను, ఆశావహులు కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ‘తానా’లో అంతర్గత సమస్యలు, విభేదాలు ఒక స్థాయి దాటి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితులు చోటు చేసుకుంటున్నందున ముందు ముందు మరింత గడ్డు సమస్యలు, అవాంఛిత వైషమ్యాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున ‘తానా’ మంచిని కోరుకునే అనేకమంది పెద్దలు, సాధారణ సభ్యులు ఏదైనా అవగాహన కుదిరితే సర్వత్రా మంచిదని ఆ దిశగా కొన్నిప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
కొద్ది మంది కప్పదాటు నాయకుల మద్దతుతోను, ‘అట్లాంటా లావు బ్రదర్స్’ ‘నరేన్’ వర్గానికి మొండి చెయ్యి చూపుతున్నకారణంగాను, ప్రస్తుతానికి బలంగా ఫీలవుతున్న ‘నిరంజన్’ వర్గం గెలుపు అవకాశాలు ఉన్నాయనుకుంటూ సర్దుబాటు చర్యలకు ఆంటీ ముట్టనట్టు స్పందిస్తూ, ‘నరేన్ ‘వర్గంపై మైండ్ గేమ్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాక గత డి సి కాన్ఫరెన్స్ లెక్కలపై జరుగుతున్న రగడను ప్రస్తుత ఎన్నికల సమయము లో ‘నరేన్’ వర్గాన్ని పూర్తి డిఫెన్సె లో పెట్టే విధముగా వివిధ రకాలుగా ఒత్తిడిని పెంచుతూ,నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఎన్నికలు ఎప్పటికైనా ఎన్నికలే నని ఫలితాలు ఏమైనా కావొచ్చని, ‘నరేన్’ వర్గానికి ఉన్న క్షేత్ర స్థాయి పట్టును తక్కువగా అంచనా వేయ వీలులేదని, కాన్ఫరెన్స్ లెక్కల కంటే పెద్ద పెద్ద ఆరోపణలను పూచిక పుల్లల్లాగా లెక్కచేయకుండా నెగ్గుకొచ్చిన చరిత్ర చాలా ఉందని, వారి ఆయుధాల సంచిని ఇంకా మూసే ఉంచారని, ప్రశాంతంగాను-పద్దతిగాను ప్రచారంలో తనదైన స్టైల్ తో తెలుగు ప్రజలను ఆకట్టుకొంటున్న ‘గోగినేని ‘ఇప్పటికే అందరికంటే ముందు ఉన్నా ఏమీ ఆశ్చర్యం లేదనీ, నమ్ముకున్న బాలట్ కలెక్షన్లు ముమ్మరంగా జరిగే పరిస్థితులు లేకపోవడం చాలా ప్రమాదకరమే గాక అనుమానాస్పదమేనని, అవకాశముంటే వీలైనంత వరకు ఎన్నికలు తప్పించి, ఓటమి ప్రమాదం లేకుండా చేసుకోవటం ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు.
అలాగే క్షేత్రస్థాయి లో చాల చోట్ల ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ ‘నరేన్’ నుంచి గాని, డి సి నాయకున్నించి గాని ఆశించినంత నాయకత్వ ప్రదర్శన లేకపోవడంతో పాటు, ‘నిరంజన్’వర్గము చేస్తున్న మైండ్ గేమ్ లో స్థానిక నాయకుల కొంత గందరగోళంలో ఉన్నారు. ఒక్కసారి నామినేషన్ల పర్వం మొదలైతే అట్లాంటా ‘తానా’ సభ్యులపై అన్నిరకాలుగా పూర్తి స్థాయి కేంద్రీకరణతో పాటు అన్నిచోట్లా ఉన్న ‘జంపింగ్ జిలానీ’ లను దారికి తెచ్చుకోవటం పెద్ద సమస్య కాబోదని కూడా నమ్ముతున్నారు.అదే సమయంలో డి సి నాయకులపై ‘అట్లాంటా బ్రదర్స్ ‘వ్యతిరేకంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ,ఎవరికీ వ్యతిరేకం కాని ‘గోగినేని’ సీనియారిటీ దృష్ట్యా ముందు పెట్టుకుంటే ఉభయత్రా శుభమని, ఆయనకు ఉన్న స్వచ్చంద ఓటు బ్యాంకు క్రమక్రమంగా పెరుగుతున్న కారణంగా, అది కూడా కలిస్తే విజయానికి అతి దగ్గర దారే గాక, ఏకగ్రీవానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువని చాలమంది వర్గ నాయకులు భావించడమే కాకుండా, ఈ ప్రతిపాదనను ముఖ్య నాయకులు కు నివేదించారు. క్రమక్రమంగా పెరుగున్న ఈ ప్రతిపాదనను కొట్టివేయలేని పరిస్తుతుల్లోనూ, వర్గానికి సమర స్ఫూర్తి కలిగించడం కూడా అత్యవసరమేనని భావిస్తూ, రెండో వర్గంపై అధిపత్యానికి ఇదీ ఒక అవకాశమని గమనించిన ‘నరేన్’ వర్గ నాయకులు, ఈ ప్రతిపాదనను కొట్టి వేయకుండా వ్యూహాత్మకంగా క్రమ క్రమంగా ప్రయోగించే పద్ధతిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
‘నరేన్’ వర్గానికి చెంది బే ఏరియా పెద్దాయన తో ‘నమస్తే ఆంధ్ర’ మాట్లాడినప్పుడు ప్రస్తుత ఉద్రక్తపరిస్థితి ‘తానా’ భవిష్యత్తుకు ప్రమాదకరంగా ఉన్న విషయము అంగీకరిస్తూ ,ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి ‘నరేన్ ‘ను సమర్దిస్తున్నప్ప్పటికీ ఎన్నికలు నివారిస్తే సంస్థకు, తెలుగు సమాజానికి మేలుకలిగే కారణంగా ఏకగ్రీవ అభ్యర్థిగా ‘గోగినేని’ ని మనస్పూర్తిగా సమర్దిస్తున్నామని, ఈ ప్రతిపాదనను ఇప్పటికే చేరవేశామని దీనికి మిగతా వారందరూ మెల్లగా నైనా సానుకూలంగా స్పందిస్తే మిగతా పదవులకు కూడా చాలావరకు పోటీలు నివారించ గలుగుతామని చెప్పారు. ‘నిరంజన్ ‘ను ఈ విషయమై సంప్రదించగా వ్యక్తిగతంగా తన వరకు ఎటువంటి ప్రతిపాదన చేరలేదని, ఇప్పటి వరకైతే అట్టి ఆలోచన లేదని, ఏదేమైనా తనకు ముందునుంచి సన్నిహితుడైన ‘గోగినేని’ గారితో త్వరలో మాట్లాడతానని చెప్పారు. అలాగే ఈ విషయమై వచ్చే రెండు సంవత్సరాలు సంస్థను నడపాల్సిన భాద్యతేగాక, డి సి నాయకుల్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పబడుతున్న ‘లావు అంజయ్య చౌదరి ను’ ‘నమస్తే ఆంధ్ర’ సంప్రదించగా, ఎలెక్షన్లు నివారించే ఏ ప్రతిపాదననైన తాము తప్పకుండా స్వాగతిస్తామని, రెండు వర్గాల మధ్య రాజీకి తాము కూడా విఫల ప్రయత్నమైతే చేశామని, సీనియర్ నాయకుడైన ‘గోగినేని’ పై తమకు ఎట్టి వ్యతిరేకత లేకపోగా, ఏకగ్రీవమైతే తామే ముందు సంతోషిస్తామని, అయన సేవలు కూడా ‘తానా’ కు ఎంతో ఉపయోగమని చెప్పారు. దీనిని బట్టి రాబోయే కొద్దీ రోజులలో ఏ పరిణామాలైన సంభవించవచ్చు అని తెలుస్తోంది.
ఏకగ్రీవ ప్రయత్నాలపై ‘శ్రీనివాస గోగినేని’ని సంప్రదించగా తనకు ఎట్టి సమాచారం లేదనీ, అయితే కొంతమంది ‘నరేన్’ వర్గ ప్రముఖులు తానైతే బాగుంటుందని వ్యక్తీకరించిన విషయం నిజమని, తాను సోమవారంనాడు నామినేషన్ పంపుతున్నానని,రెండు వర్గాలుగా అన్నిపదవులకు పానెల్స్ గా పోటీ జరగడం ఖచ్చితంగా ‘తానా’ సంస్థకు నష్టమేగాక దీర్ఘ కాలంపాటు అనైక్యత , ప్రతీకారేచ్చలు ప్రబలే ప్రమాదమున్నందున,ఎన్నికల నివారణ ప్రయత్నాలు హర్షించ దగినవేనన్నారు.ఏదేమైనా వర్గాలకు అతీతంగా వ్యవహిరిస్తున్న తనకు న్యూట్రల్ సభ్యుల నించే కాక రెండు వర్గాలనుంచి కూడా ప్రెసిడెంట్ పదవికి అర్హుడుగా గట్టి మద్దతు కనిపిస్తోందనీ, తీవ్ర ‘క్రాస్ వోటింగ్’ జరిగి మంచి మెజారిటీతో తన విజయము తధ్యమని భావిస్తున్నానన్నారు.
రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఆశిస్తూ ఏమి జరుగుందో ఆసక్తిగా తిలకిద్దాం.