షర్మిల ప్రిలాంచ్ మీటింగ్ .. గేమ్ ఇదే

అన్నతో విభేదాలు అని లీకులు ఇచ్చి రాధాకృష్ణతో షర్మిల ఎంత వార్తలు రాయించుకున్నా..ఇదంతా వ్యూహాత్మకం అని అందరికీ అర్థమైపోయింది.ఇది తెలుసుకోవడం చాలా సింపుల్.
అన్నమీద కోపం ఉంటే ఆంధ్రాలో పార్టీ పెట్టాలి గాని తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటి? పైగా ఈమె కోసమే అన్నట్టు గత పలు ఎన్నికల్లో వైసీపీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు జగన్ రెడ్డి.
ప్రస్తుతం తెలంగాణలో అటు కేసీఆర్ తో, ఇటు బీజేపీతో ఎటూ కాకుండా పోయిన రెడ్లు కాంగ్రెస్ మీద ఆశలు వదులుకుంటే అది మొదటికే మోసం.అందుకే ఆ రెడ్డి  కూటమి కట్టి హంగ్ అసెంబ్లీతో అన్నసాయంతో రాజకీయం చేయడమే షర్మిల ప్రధాన ఉద్దేశం.దీనికి జగనన్న అండ పుష్కలంగా ఉంది.
ఎలాగూ ఆంధ్రానుంచి వలస వచ్చిన లక్షలాది కన్వర్టెడ్ క్రిస్టియన్ కూలీ జనాభా హైదరాబాదు నిండా ఉంది. బ్రదర్ అనిల్ కి వారితో ఓట్లు గుద్దించడం ఎలాగో వెన్నతో పెట్టిన విద్య.
ఏ వనరుని వృథా పోనివ్వకుండా చాలా తెలివిగా అన్ని విధాల వాడుకోగలిగిన సమర్థుడు జగన్ సొంత చెల్లితో విభేదాలు అక్కడిదాకా తెచ్చుకుంటాడు అని మెడ మీద తలకాయ ఉన్నఎవడూ అనుకోడు.
ఇది కేసీఆర్ -బీజేపీ- జగన్ ఆడుతున్న ట్రయాంగిల్ గేమ్.బలిపశువు ఎవరన్నది భవిష్యత్తు మాత్రమే చెబుతుంది.సరే ఈ విషయం ఓ పక్కనుంచితే ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆమె తెలంగాణలో కొందరు వైసీపీ నేతలతో పార్టీ ప్రి లాంచ్ మీటింగ్  నిర్వహిస్తున్నారు.
ఈ మీటింగ్ కి హాజరుకావాలంటూ వైఎస్ షర్మిల కార్యాలయం నుంచి పార్టీతో టచ్‌లో ఉన్న తెలంగాణ నేతలు అందరికీ సమాచారం అందిందట.వైఎస్ షర్మిల సమావేశం నేపథ్యంలో భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘ఛలో లోటస్ పాండ్’ అంటూ సోషల్ మీడియాలో క్యాపెయినింగ్ సాగుతోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.