'తానా' ఎన్నికల్లో నామినేషన్ల పర్వం-ముమ్మరంగా ఏకగ్రీవ ప్రయత్నాల కొనసాగింపు

'తానా' ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13 కల్లా నామినేషన్లు ఎలక్షన్ కమిషన్ వద్దకు చేరవలసిన కారణంగా అభ్యర్థులు బిజీబిజీగా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఎన్నికలు లేకుండా పదవులు పొందే సర్దుబాటు అలవాటు కారణంగాను, నామినేషన్ ఫీజు అత్యధికంగా ఉన్న కారణంగానూ, ఖచ్చితంగా పోటీ జరిగే మూలంగాను, ఆశావహులు కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. 'తానా'లో అంతర్గత సమస్యలు, విభేదాలు ఒక స్థాయి దాటి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితులు చోటు చేసుకుంటున్నందున ముందు ముందు మరింత గడ్డు సమస్యలు, అవాంఛిత వైషమ్యాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున 'తానా' మంచిని కోరుకునే అనేకమంది పెద్దలు, సాధారణ సభ్యులు ఏదైనా అవగాహన కుదిరితే సర్వత్రా మంచిదని ఆ దిశగా కొన్నిప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
కొద్ది మంది కప్పదాటు నాయకుల మద్దతుతోను, 'అట్లాంటా లావు బ్రదర్స్' 'నరేన్' వర్గానికి మొండి చెయ్యి చూపుతున్నకారణంగాను, ప్రస్తుతానికి బలంగా ఫీలవుతున్న 'నిరంజన్' వర్గం గెలుపు అవకాశాలు ఉన్నాయనుకుంటూ సర్దుబాటు చర్యలకు ఆంటీ ముట్టనట్టు స్పందిస్తూ, 'నరేన్ 'వర్గంపై మైండ్ గేమ్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాక గత డి సి కాన్ఫరెన్స్ లెక్కలపై జరుగుతున్న రగడను ప్రస్తుత ఎన్నికల సమయము లో 'నరేన్' వర్గాన్ని పూర్తి డిఫెన్సె లో పెట్టే విధముగా వివిధ రకాలుగా ఒత్తిడిని పెంచుతూ,నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఎన్నికలు ఎప్పటికైనా ఎన్నికలే నని ఫలితాలు ఏమైనా కావొచ్చని, 'నరేన్' వర్గానికి ఉన్న క్షేత్ర స్థాయి  పట్టును తక్కువగా అంచనా వేయ వీలులేదని, కాన్ఫరెన్స్ లెక్కల కంటే పెద్ద పెద్ద ఆరోపణలను పూచిక పుల్లల్లాగా లెక్కచేయకుండా నెగ్గుకొచ్చిన చరిత్ర చాలా ఉందని, వారి ఆయుధాల సంచిని ఇంకా మూసే ఉంచారని, ప్రశాంతంగాను-పద్దతిగాను ప్రచారంలో తనదైన స్టైల్ తో తెలుగు ప్రజలను ఆకట్టుకొంటున్న 'గోగినేని 'ఇప్పటికే అందరికంటే ముందు ఉన్నా ఏమీ ఆశ్చర్యం లేదనీ, నమ్ముకున్న బాలట్ కలెక్షన్లు ముమ్మరంగా జరిగే పరిస్థితులు లేకపోవడం చాలా ప్రమాదకరమే గాక అనుమానాస్పదమేనని, అవకాశముంటే వీలైనంత వరకు ఎన్నికలు తప్పించి, ఓటమి ప్రమాదం లేకుండా చేసుకోవటం ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు.
అలాగే క్షేత్రస్థాయి లో చాల చోట్ల ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ 'నరేన్' నుంచి గాని, డి సి నాయకున్నించి గాని ఆశించినంత నాయకత్వ ప్రదర్శన లేకపోవడంతో పాటు, 'నిరంజన్'వర్గము చేస్తున్న మైండ్ గేమ్ లో స్థానిక నాయకుల కొంత గందరగోళంలో ఉన్నారు. ఒక్కసారి నామినేషన్ల పర్వం మొదలైతే అట్లాంటా 'తానా' సభ్యులపై అన్నిరకాలుగా పూర్తి స్థాయి కేంద్రీకరణతో పాటు అన్నిచోట్లా ఉన్న 'జంపింగ్ జిలానీ' లను దారికి తెచ్చుకోవటం పెద్ద సమస్య కాబోదని కూడా నమ్ముతున్నారు.అదే సమయంలో డి సి నాయకులపై 'అట్లాంటా బ్రదర్స్ 'వ్యతిరేకంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ,ఎవరికీ వ్యతిరేకం కాని 'గోగినేని' సీనియారిటీ  దృష్ట్యా ముందు పెట్టుకుంటే ఉభయత్రా శుభమని, ఆయనకు ఉన్న స్వచ్చంద ఓటు బ్యాంకు క్రమక్రమంగా పెరుగుతున్న కారణంగా, అది కూడా కలిస్తే  విజయానికి  అతి దగ్గర దారే గాక, ఏకగ్రీవానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువని చాలమంది వర్గ నాయకులు భావించడమే కాకుండా, ఈ ప్రతిపాదనను ముఖ్య నాయకులు కు నివేదించారు. క్రమక్రమంగా పెరుగున్న ఈ ప్రతిపాదనను కొట్టివేయలేని పరిస్తుతుల్లోనూ, వర్గానికి సమర స్ఫూర్తి కలిగించడం కూడా అత్యవసరమేనని భావిస్తూ, రెండో వర్గంపై అధిపత్యానికి ఇదీ ఒక అవకాశమని గమనించిన 'నరేన్' వర్గ నాయకులు, ఈ ప్రతిపాదనను కొట్టి వేయకుండా వ్యూహాత్మకంగా క్రమ క్రమంగా ప్రయోగించే పద్ధతిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
'నరేన్' వర్గానికి చెంది బే ఏరియా పెద్దాయన తో 'నమస్తే ఆంధ్ర' మాట్లాడినప్పుడు ప్రస్తుత ఉద్రక్తపరిస్థితి 'తానా' భవిష్యత్తుకు ప్రమాదకరంగా ఉన్న విషయము అంగీకరిస్తూ ,ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి 'నరేన్ 'ను సమర్దిస్తున్నప్ప్పటికీ ఎన్నికలు నివారిస్తే సంస్థకు, తెలుగు సమాజానికి  మేలుకలిగే కారణంగా ఏకగ్రీవ అభ్యర్థిగా 'గోగినేని' ని మనస్పూర్తిగా సమర్దిస్తున్నామని, ఈ ప్రతిపాదనను ఇప్పటికే చేరవేశామని దీనికి  మిగతా వారందరూ మెల్లగా నైనా సానుకూలంగా స్పందిస్తే మిగతా పదవులకు కూడా చాలావరకు పోటీలు నివారించ గలుగుతామని చెప్పారు. 'నిరంజన్ 'ను ఈ విషయమై సంప్రదించగా వ్యక్తిగతంగా తన వరకు ఎటువంటి ప్రతిపాదన చేరలేదని, ఇప్పటి వరకైతే అట్టి ఆలోచన లేదని, ఏదేమైనా తనకు ముందునుంచి సన్నిహితుడైన 'గోగినేని' గారితో త్వరలో మాట్లాడతానని చెప్పారు. అలాగే ఈ విషయమై వచ్చే రెండు సంవత్సరాలు సంస్థను నడపాల్సిన భాద్యతేగాక, డి సి నాయకుల్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పబడుతున్న 'లావు అంజయ్య చౌదరి ను'  'నమస్తే ఆంధ్ర' సంప్రదించగా, ఎలెక్షన్లు నివారించే ఏ ప్రతిపాదననైన తాము తప్పకుండా స్వాగతిస్తామని, రెండు వర్గాల మధ్య రాజీకి తాము కూడా విఫల ప్రయత్నమైతే చేశామని, సీనియర్ నాయకుడైన 'గోగినేని' పై తమకు ఎట్టి వ్యతిరేకత లేకపోగా, ఏకగ్రీవమైతే తామే ముందు సంతోషిస్తామని, అయన సేవలు కూడా 'తానా' కు ఎంతో ఉపయోగమని చెప్పారు. దీనిని  బట్టి రాబోయే కొద్దీ రోజులలో ఏ పరిణామాలైన సంభవించవచ్చు అని తెలుస్తోంది.
ఏకగ్రీవ ప్రయత్నాలపై 'శ్రీనివాస గోగినేని'ని సంప్రదించగా తనకు ఎట్టి సమాచారం లేదనీ, అయితే కొంతమంది 'నరేన్' వర్గ ప్రముఖులు తానైతే బాగుంటుందని వ్యక్తీకరించిన విషయం నిజమని, తాను సోమవారంనాడు నామినేషన్ పంపుతున్నానని,రెండు వర్గాలుగా అన్నిపదవులకు పానెల్స్ గా పోటీ జరగడం ఖచ్చితంగా 'తానా' సంస్థకు నష్టమేగాక దీర్ఘ కాలంపాటు అనైక్యత , ప్రతీకారేచ్చలు ప్రబలే  ప్రమాదమున్నందున,ఎన్నికల నివారణ ప్రయత్నాలు హర్షించ దగినవేనన్నారు.ఏదేమైనా వర్గాలకు అతీతంగా వ్యవహిరిస్తున్న తనకు న్యూట్రల్ సభ్యుల నించే కాక రెండు వర్గాలనుంచి కూడా ప్రెసిడెంట్ పదవికి అర్హుడుగా  గట్టి మద్దతు కనిపిస్తోందనీ, తీవ్ర 'క్రాస్ వోటింగ్' జరిగి మంచి మెజారిటీతో తన విజయము తధ్యమని భావిస్తున్నానన్నారు.
రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఆశిస్తూ  ఏమి జరుగుందో ఆసక్తిగా తిలకిద్దాం.
‘తానా‘ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న‘గోగినేని’-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో?
‘తానా‘ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న‘గోగినేని’-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో ??
‘తానా’ టీం స్క్వేర్-ఆపదలో ఆపన్న హస్తం-అమెరికా తెలుగువాళ్ళకు ’911′ వ్యవస్థలాంటిది
‘తానా’ ఎన్నికల కోలాహలం రోజు రోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ‘తానా’ ఎందుకు,శుద్ధ దండుగ,ఈ మధ్య వింటున్నదంతా ఏమీ సంతోషకరంగా లేదనే వారు ‘తానా ’తెలుగు వారికీ ,తెలుగు భాషకూ,తెలుగు సంస్కృతికీ ఎంత చేసిందీ,ఇంకా ఎంత చేయగలుగుతుందీ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
‘తానా’ఎన్నికలు-చదరంగపు ఎత్తులా? వైకుంఠపాళి జిత్తులా??
ఈ రోజు జరుగుతున్న‘తానా’ బోర్డు మీటింగ్ తర్వాత ‘తానా’ఎన్నికల షెడ్యూల్ రానున్నందున ఎన్నికల రణానికి సిద్ధమవటం లో భాగంగా అనేక పరిణామాలు చకచకా సాగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్-‘తానా‘ఎన్నికల గందరగోళం-‘రవి పొట్లూరి’కూడా ప్రెసిడెంట్ అభ్యర్థి గా బరిలోకి..
మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న ‘తానా‘ఎన్నికల సమరభేరి ‘రవి పొట్లూరి’ కూడ ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది.
‘తానా‘సంక్రాంతి-బెట్టింగ్ బంగార్రాజులకు పండగే-ఎన్నికల కయ్యానికి కాలు దువ్విన ‘పుంజులు’
‘తానా’ ఎన్నికలవిషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,‘తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.