‘నమస్తే ఆంధ్ర’ ముందునించి చెబుతున్నట్లుగానే ‘తానా’ఎన్నికల ప్రహసనం అత్యంత రసవత్తరంగా సాగుతూ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసిన ఒక్క రోజులోనే అనేక సుడులు తిరుగుతూ ఆశావహులందరి బుర్రల్లోనూ పదును
పెడుతోంది.ముఖ్యంగా బే ఏరియాలో ఒకే గొంగళి లో అందరితో కలసి ఇప్పటి వరకు మాంసం కూర తిన్న ఇద్దరు ‘స్వయం ప్రకటిత సంఘ సంస్కర్తలు’ బొమికలు ఏరుకుంటూ,వెంట్రుకలు ఉన్నాయంటూ అమెరికా వ్యాప్తంగా చేస్తున్న ప్రచారానికి సభ్యులు నవ్వుకోవడమే కాకుండా,వారు చేసిన కప్పగంతు అందరికీ తెలిసిందే నని,ఇప్పటివరకు వీరితోనే కలసి అన్నివిధాలుగా వీర విధేయులైన వీరు అకస్మాత్తుగా చేసే ప్రచారం వారి ప్యానెల్ ఉపయోగానికి కాకుండా,ఇదే విషయమై రెండు వర్గాలను ముందునుంచి ప్రశ్నిస్తూన్న ‘శ్రీనివాస గోగినేని’ కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.’నిరంజన్ శృంగవరపు’వర్గం గత డి సీ కాన్ఫరెన్స్ లెక్కల గురుంచి పూర్తి స్థాయిలో ‘నరేన్ కొడాలి’వర్గానిని ఇరకాటంలో పెడతానికి ప్రయత్నిస్తుంటే,ఎన్నికల సమయంలో రచ్చచేసి లబ్ది పొందటానికి ప్రయత్నిస్తున్నారని వారిని ఎదురు ప్రశ్నిస్తున్నారు.ఇదే కాన్ఫరెన్స్ లెక్కల విషయం వాడుకుంటూ,కప్ప గంతును సమర్ధించుకోవటానికన్నట్లు,గత శుక్రవారం బే ఏరియా లో పెట్టిన జూమ్ కాన్ఫరెన్స్ కాల్ లో కొత్తగా వెలసిన ‘స్వయం ప్రకటిత సంఘ సంస్కర్తలు’ వివరిస్తుండగా,ఇప్పుడు దాకా ఆగి ఇప్పుడే ఏమిటి అదీ బే ఏరియాలో అని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నసమయంలో,’నరేన్ కొడాలి’వర్గానికి సంబందించిన పెద్దాయిన సడన్ గా వచ్చి,మీ ఇద్దరూ రాజకీయం చేస్తూ సంస్కరిస్తామని చెప్పవలసిన అవరమేమిటీ అనీ, క్రిమినల్ రికార్డు కూడా ఉన్న మీరు మిగతావాళ్లకి చెప్పేది ఏమిటీ, ‘నరేన్ కొడాలి’ఎమన్నా క్రిమినలా అని,రాజకీయం రాజకీయం గానే చేసుకోండి అని ఎమోషనల్గా ప్రశ్నించడంతో ఖంగు తిన్నారు.
ఇక వచ్చే రెండు ఏళ్ళు సంస్థను నడపవలసిన’లావు బ్రదర్స్’ గాడ్ ఫాదర్ పాత్రను చేతిలోకి తీసేసుకున్నట్లుగా నిరంజన్,నరేన్ రెండు వర్గాలను గత వారాంతం అట్లాంటా పిలిపించి మాట్లాడినట్లు, నరేన్ ను బరిలో తప్పుకుంటే బాగుంటుందేమో నని చెప్పినట్లు,ఇలాగే ఉంటె నిరంజన్ వర్గానికి సపోర్ట్ చేయవలసి రావచ్చని చెప్పినట్లు,దానికి ఒక రోజు తరవాత చెప్తామని నరేన్ వర్గం చెప్పినట్లు పక్కా సమాచారం.దీనితో బాలట్ కలెక్షన్ల లెక్కల చిట్టా కూడికలు తీసివేతలపై అంచనాలు మారిపోతున్నాయి.పర్యవసానాలపై అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు వాదోపవాదాలు మొదలయ్యాయి. అట్లాంటా లో కూడా అనేక మంది సభ్యులు లేని పోని రాజకీయం మన తలలపై ఎందుకు తెస్తారని కొంతమంది,లావు బ్రదర్స్ ఏమైనా అట్లాంటా మొత్తాన్ని గుత్తకు తీసుకున్నారా అని కొంతమంది,వీళ్లు కూడా ఆ ‘తాను ముక్కలే ‘కదా అంత గాక ఇంకేమి చేస్తారు అట్లాంటాను కూడా సంస్కరించాల్సిందే అని మరికొంతమంది అంటున్నారు.ముఖ్యంగా నరేన్ వర్గంలో ముఖ్యులు అన్నిరాష్ట్రాల్లో తీవ్ర మేధో మధనం జరుపుతూ దీనిని జాగ్రత్తగా హేండిల్ చేయకపోతే అమెరికాలోను,అంతర్జాతీయంగాను అభాసు పాలవ్వటం తప్పదని భయపడుతున్నారు.కొద్దిమంది అత్యంత ప్రముఖులు ఇప్పటికైనా భేషజాలకు పోకుండా క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని ఒప్పుకొని,వీలయితే వివాదాలు తావులేకుండా ‘తానా’ జండా పట్టి మద్దతు పెంచుకుంటూ సాగిపోతూ ఉన్న ‘శ్రీనివాస గోగినేని’ని సమర్ధించటం అందరికీ మంచిదని సలహా ఇస్తున్నారు.
‘నమస్తే ఆంధ్ర తో ‘మాట్లాడిన కొద్దిమంది ముఖ్యులు దీనిని ధ్రువీకరిస్తూ ఈ ఆలోచనకు మద్దతు విపరీతంగా వస్తోందని,నరేన్ చాలా మంచి వ్యక్తి అయినా, ప్రస్తుతం డి సి కాపిటల్ ఏరియా వ్యక్తి కావటమే ముఖ్య సమస్య అని, ప్రస్తుత పరిస్థితుల్లో ‘తానా ‘ఇమేజీ పరంగా కూడా ‘శ్రీనివాస గోగినేని’ మంచి ఛాయస్ అని ఈ విషయం ఒకటీ రెండు రోజుల్లో కొలిక్కి రావొచ్చని చెప్పారు.ఇదిలా ఉండగా మిగతా పదవులకు పోటీ కొరకు ప్రయత్నాలు అన్నిచోట్లా ముమ్మరంగా మొదలయ్యాయి.