'తానా'ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న'గోగినేని'-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో?

NRI
'నమస్తే ఆంధ్ర' ముందునించి చెబుతున్నట్లుగానే 'తానా'ఎన్నికల ప్రహసనం అత్యంత రసవత్తరంగా సాగుతూ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసిన ఒక్క రోజులోనే అనేక సుడులు తిరుగుతూ ఆశావహులందరి బుర్రల్లోనూ పదును
పెడుతోంది.ముఖ్యంగా బే ఏరియాలో ఒకే  గొంగళి లో అందరితో కలసి ఇప్పటి వరకు మాంసం కూర తిన్న ఇద్దరు 'స్వయం ప్రకటిత సంఘ సంస్కర్తలు' బొమికలు ఏరుకుంటూ,వెంట్రుకలు ఉన్నాయంటూ అమెరికా వ్యాప్తంగా చేస్తున్న ప్రచారానికి సభ్యులు నవ్వుకోవడమే కాకుండా,వారు చేసిన కప్పగంతు అందరికీ తెలిసిందే నని,ఇప్పటివరకు వీరితోనే కలసి అన్నివిధాలుగా వీర విధేయులైన వీరు అకస్మాత్తుగా చేసే ప్రచారం వారి ప్యానెల్ ఉపయోగానికి కాకుండా,ఇదే విషయమై రెండు వర్గాలను ముందునుంచి ప్రశ్నిస్తూన్న 'శ్రీనివాస గోగినేని' కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.'నిరంజన్ శృంగవరపు'వర్గం గత డి సీ కాన్ఫరెన్స్ లెక్కల గురుంచి పూర్తి స్థాయిలో 'నరేన్ కొడాలి'వర్గానిని ఇరకాటంలో పెడతానికి ప్రయత్నిస్తుంటే,ఎన్నికల సమయంలో రచ్చచేసి లబ్ది పొందటానికి ప్రయత్నిస్తున్నారని వారిని ఎదురు ప్రశ్నిస్తున్నారు.ఇదే కాన్ఫరెన్స్ లెక్కల విషయం వాడుకుంటూ,కప్ప గంతును సమర్ధించుకోవటానికన్నట్లు,గత శుక్రవారం బే ఏరియా లో పెట్టిన జూమ్ కాన్ఫరెన్స్ కాల్ లో కొత్తగా వెలసిన 'స్వయం ప్రకటిత సంఘ సంస్కర్తలు' వివరిస్తుండగా,ఇప్పుడు దాకా ఆగి ఇప్పుడే ఏమిటి అదీ బే ఏరియాలో అని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నసమయంలో,'నరేన్ కొడాలి'వర్గానికి సంబందించిన పెద్దాయిన సడన్ గా వచ్చి,మీ ఇద్దరూ రాజకీయం చేస్తూ సంస్కరిస్తామని చెప్పవలసిన అవరమేమిటీ అనీ, క్రిమినల్ రికార్డు కూడా ఉన్న మీరు మిగతావాళ్లకి చెప్పేది ఏమిటీ, 'నరేన్ కొడాలి'ఎమన్నా క్రిమినలా అని,రాజకీయం రాజకీయం గానే చేసుకోండి అని ఎమోషనల్గా ప్రశ్నించడంతో ఖంగు తిన్నారు.
ఇక వచ్చే రెండు ఏళ్ళు సంస్థను నడపవలసిన'లావు బ్రదర్స్' గాడ్ ఫాదర్ పాత్రను చేతిలోకి తీసేసుకున్నట్లుగా నిరంజన్,నరేన్ రెండు వర్గాలను గత వారాంతం అట్లాంటా పిలిపించి మాట్లాడినట్లు, నరేన్ ను బరిలో తప్పుకుంటే బాగుంటుందేమో నని చెప్పినట్లు,ఇలాగే ఉంటె నిరంజన్ వర్గానికి సపోర్ట్ చేయవలసి రావచ్చని చెప్పినట్లు,దానికి ఒక రోజు తరవాత చెప్తామని నరేన్ వర్గం చెప్పినట్లు పక్కా సమాచారం.దీనితో బాలట్ కలెక్షన్ల లెక్కల చిట్టా కూడికలు తీసివేతలపై అంచనాలు మారిపోతున్నాయి.పర్యవసానాలపై అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు వాదోపవాదాలు మొదలయ్యాయి. అట్లాంటా లో కూడా అనేక మంది సభ్యులు లేని పోని రాజకీయం మన తలలపై ఎందుకు తెస్తారని కొంతమంది,లావు బ్రదర్స్ ఏమైనా అట్లాంటా మొత్తాన్ని గుత్తకు తీసుకున్నారా అని కొంతమంది,వీళ్లు కూడా ఆ 'తాను ముక్కలే 'కదా అంత గాక ఇంకేమి చేస్తారు అట్లాంటాను కూడా సంస్కరించాల్సిందే అని మరికొంతమంది అంటున్నారు.ముఖ్యంగా నరేన్ వర్గంలో ముఖ్యులు అన్నిరాష్ట్రాల్లో తీవ్ర మేధో మధనం జరుపుతూ దీనిని జాగ్రత్తగా హేండిల్ చేయకపోతే అమెరికాలోను,అంతర్జాతీయంగాను అభాసు పాలవ్వటం తప్పదని భయపడుతున్నారు.కొద్దిమంది అత్యంత ప్రముఖులు ఇప్పటికైనా భేషజాలకు పోకుండా క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని ఒప్పుకొని,వీలయితే వివాదాలు తావులేకుండా 'తానా' జండా పట్టి మద్దతు పెంచుకుంటూ సాగిపోతూ ఉన్న 'శ్రీనివాస గోగినేని'ని సమర్ధించటం అందరికీ మంచిదని సలహా ఇస్తున్నారు.
'నమస్తే ఆంధ్ర తో 'మాట్లాడిన కొద్దిమంది ముఖ్యులు దీనిని ధ్రువీకరిస్తూ ఈ ఆలోచనకు మద్దతు విపరీతంగా వస్తోందని,నరేన్ చాలా మంచి వ్యక్తి అయినా, ప్రస్తుతం డి సి కాపిటల్ ఏరియా వ్యక్తి కావటమే ముఖ్య సమస్య అని, ప్రస్తుత పరిస్థితుల్లో 'తానా 'ఇమేజీ పరంగా కూడా 'శ్రీనివాస గోగినేని' మంచి ఛాయస్ అని ఈ విషయం ఒకటీ రెండు రోజుల్లో కొలిక్కి రావొచ్చని చెప్పారు.ఇదిలా ఉండగా మిగతా పదవులకు పోటీ కొరకు ప్రయత్నాలు అన్నిచోట్లా ముమ్మరంగా మొదలయ్యాయి.
‘తానా’ టీం స్క్వేర్-ఆపదలో ఆపన్న హస్తం-అమెరికా తెలుగువాళ్ళకు ’911′ వ్యవస్థలాంటిది
‘తానా’ ఎన్నికల కోలాహలం రోజు రోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ‘తానా’ ఎందుకు,శుద్ధ దండుగ,ఈ మధ్య వింటున్నదంతా ఏమీ సంతోషకరంగా లేదనే వారు ‘తానా ’తెలుగు వారికీ ,తెలుగు భాషకూ,తెలుగు సంస్కృతికీ ఎంత చేసిందీ,ఇంకా ఎంత చేయగలుగుతుందీ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
‘తానా’ఎన్నికలు-చదరంగపు ఎత్తులా? వైకుంఠపాళి జిత్తులా??
ఈ రోజు జరుగుతున్న‘తానా’ బోర్డు మీటింగ్ తర్వాత ‘తానా’ఎన్నికల షెడ్యూల్ రానున్నందున ఎన్నికల రణానికి సిద్ధమవటం లో భాగంగా అనేక పరిణామాలు చకచకా సాగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్-‘తానా‘ఎన్నికల గందరగోళం-‘రవి పొట్లూరి’కూడా ప్రెసిడెంట్ అభ్యర్థి గా బరిలోకి..
మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న ‘తానా‘ఎన్నికల సమరభేరి ‘రవి పొట్లూరి’ కూడ ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది.
‘తానా‘సంక్రాంతి-బెట్టింగ్ బంగార్రాజులకు పండగే-ఎన్నికల కయ్యానికి కాలు దువ్విన ‘పుంజులు’
‘తానా’ ఎన్నికలవిషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,‘తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.