మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో తమన్నా ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా సత్తా చాటుతున్న తమన్నా.. ఇటీవల కాలంలో సినిమాల్లో కంటే ఐటమ్ సాంగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
ఇక ఆ సంగతి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారు. అయితే తమన్నాకు విజయ్ వర్మ ఫస్ట్ లవ్ కాదు. విజయ్ తో ప్రేమలో పడటం కన్నా ముందే తమన్నాకు రెండు సార్లు బ్రేకప్ జరిగింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా రివీల్ చేసింది.
అయితే ఫస్ట్ బ్రేకప్ ఎప్పుడు జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఎందుకంటే, 5వ క్లాస్ చదువుతున్నప్పుడే తమన్నా ప్రేమలో పడిందట. తన ఫ్రెండ్ అన్నను లవ్ చేసిందట. అంతేకాదు ఒక రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని అతనికి చెప్పిందట. కానీ సదరు అబ్బాయి మాత్రం తమన్నాను చెల్లి అనేశాడట. నా సిస్టర్ కు ఫ్రెండ్ కావడంతో నిన్ను కూడా ఒక సిస్టర్ గానే చూశానని సదరు అబ్బాయి అనడంతో తమన్నా హార్ట్ బ్రేక్ అయింది.
ఈ విషయాన్ని ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడంతో.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 5వ క్లాస్ లోనే ఒక అబ్బాయిని ప్రేమించి ప్రపోజ్ చేశావా.. మరీ ఇంత ఫాస్ట్ అయితే ఎలా తమన్నా అంటూ కొందరు మిల్కీ బ్యూటీ ని ఆట పట్టిస్తుంటే.. మరికొందరు ఆమె సెకండ్ బ్రేకప్ ఎవరితో జరిగిందా? అని ఆరా తీయడం ప్రారంభించారు.