జగన్… వారిని కంట్రోల్ చేయలేకపోతున్నాడా?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతలు దండిగా ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. కానీ, వీరిలో లేనిదల్లా ఐక్యతేనని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడికక్కడ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతలు దండిగా ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. కానీ, వీరిలో లేనిదల్లా ఐక్యతేనని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడికక్కడ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా ...
జగన్ సీఎం అయితే దళితులు మరింత బాగుపడతారన్న ఆశతో ఏపీలో జగన్ తరఫున గత ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసిన దళిత యువనేతల్లో మహాసేన రాజేష్ ది ...
‘‘ మేం మాట్లాడకూడదా?...మేం మాట్లాడకూడదా?...మేం పారిపోయే బ్యాచ్ కాదు...జగన్ కాదు ఇక్కడ లోకేష్...నిలబడి చెబుతాం...కాస్త ఓపిక పట్టు’’ ఓ విలేకరిని ఉద్దేశించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి ...
ఏపీలో అధికార దుర్వినియోగం, అరాచక రాజకీయ ఆగడం లేదు. పైగా పరిస్థితులు అంతకంతకూ విషమిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని తొక్కేయడానికి అధికారపక్షం విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ...
అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. కేంద్రప్రభుత్వాన్ని పదే పదే అడిగితే తప్ప ఎంతో కొంత విదల్చదు. కానీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని సహాయం అడగలేరు. వరద బాధితులను ఆదుకోరు. ఎగువన భారీ వర్షాలు కురిశాయి! గోదావరికి భారీ వరద రాబోతుందని ముందే కేంద్ర జలసంఘం హెచ్చరించింది. రాష్ట్రంలో ఊర్లకు ఊర్లనే వరద ముంచెత్తింది. ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. మంత్రులు, అధికారులు పత్తా లేరు. సాయం చేసే నాథుడే లేడు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద ప్రాంతాలకు బయల్దేరారు. టీడీపీ నేతలు, స్థానిక కార్యకర్తలు అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు అందించడం మొదలుపెట్టారు. సీఎం జగన్ హాయిగా తాడేపల్లిలో ముసుగుతన్ని పడుకున్నారు. చంద్రబాబు సమక్షంలో బాధితులు గోడు వినిపించుకోవడం.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అందిన సాయం గుర్తుచేసుకుంటుండడంతో జగన్ కళ్లు తెరిచారు. తాడేపల్లి నుంచి బయటకొచ్చి.. విశాఖ వెళ్లి ఓ పథకానికి బటన్ నొక్కి.. తిరుగుప్రయాణంలో హెలిక్టాపర్‌లో గోదావరిలో ఏరియల్ సర్వే చేశారు. సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నారు. వరద పరిస్థితిని కళ్లారా చూసిన ఆయన.. ఉదారంగా సహాయం చేయాలని కేంద్రాన్ని కోరతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రెండోసారి వరదలు వచ్చినా.. నోరు తెరిచి సాయం కోరలేదు. నష్టాలపై నివేదికా పంపలేదు. పొరుగునే ఉన్న తెలంగాణ... వరదల వల్ల రూ.1,400 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. మహారాష్ట్ర సర్కారు రూ.1,500 కోట్ల సాయం అడిగింది. తెలంగాణ, మహారాష్ట్రతో పోల్చితే గోదావరి వరదతో భారీగా నష్టపోయిన ఏపీ మాత్రం మౌన గీతం పాడుతోంది. ముఖ్యమంత్రికి కేంద్రాన్ని సాయం కోరే ధైర్యం కూడా లేదా? ఎందుకంత భయం? ప్రాథమిక అంచనా ఏదీ? గోదావరికి వరద పోటు మొదలై నెల దాటింది. సాధారణంగా... ముంపు సమయంలోనే వరద నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించాలి. బాధితులకు సహాయం అందించేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలి. విపత్తు నిధుల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రాన్ని కోరాలి. ఈ సంవత్సరానికి అప్పటికే కేంద్రం నిధులు ఇచ్చేసి ఉంటే... అదనపు నిధులు అడగాలి. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరనే లేదు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లాల పరిధిలో 82 గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లు, ఆస్తులు, నిత్యావసరాలు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. జరిగిన నష్టంపై ఇప్పటిదాకా ప్రాథమిక అంచనా కూడా వేయలేదు. ‘‘ఏపీలో భయంకరమైన వరద వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నాయకత్వంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల ప్రజల ప్రాణాలు కాపాడాం’’ అంటూ గొప్పలు చెప్పుకొంటూ కేంద్రానికి ఒక నివేదిక పంపించారు. అందులో... జరిగిన నష్టం, జరగాల్సిన సహాయం గురించి ప్రస్తావించనే లేదు. రాష్ట్రాలు పదేపదే కోరితేనే కేంద్రం స్పందించదు. మరి... అడగకుండానే సహాయం చేస్తుందా? అసలు భయం ఇదే... ‘నాన్నా... వంద రూపాయలు ఇవ్వు’ అని అడగ్గానే... ఏ తండ్రీ జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేయడు. ‘నిన్న ఇచ్చిన వంద ఏం చేశావు?’ అని అడుగుతాడు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్రం కూడా ఇలాగే నిక్కచ్చిగా ఉంటుంది. ‘విపత్తు నిధులు ఇవ్వండి’ అని జగన్ అడిగితే... ‘గతంలో ఇచ్చిన సొమ్ములు ఏం చేశారు?’ అని కేంద్రం ప్రశ్నిస్తుంది. అప్పుడు... జగన్ నోట సమాధానం ఉండదు. ఎందుకంటే... కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులను ...
https://twitter.com/i/status/1564240952105074689
తాజాగా అమరావతి బాండ్లకు సంబంధించిన ఓ వార్త వెలుగు చూసింది. అమరావతి బాండ్లకు రేటింగ్ అన్నది ఒక్కసారిగా పడిపోయింది. ఏ ప్లస్ నుంచి ఏ మైనస్ కు ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. గుండెపోటు అంటూ కట్టుకథలు అల్లిన వైసీపీ నేతలు చివరకు అది ...
కాపు నేస్తం ఓ బూటకం అని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మండిపడుతున్నారు. ఒక్క ఆయనే కాదు తూర్పు కాపు సంక్షేమం పేరిట శ్రీకాకుళం జిల్లాలో ...
వైఎస్ కుటుంబంలో అంతర్గత విభేదాలున్నాయని, ఆ క్రమంలోనే అన్న సీఎం జగన్ తో విభేదించిన వైఎస్ షర్మిల తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకుందని ప్రచారం జరిగిన సంగతి ...