టాలీవుడ్లో ఫ్రాంఛైజీ చిత్రాలకు ఊపు తెచ్చిన సినిమాల్లో ‘హిట్’ ఒకటి. కొత్త దర్శకుడు శైలేష్ కొలను విశ్వక్సేన్ హీరోగా రూపొందించిన ‘హిట్’ మంచి హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా ఆ ఫ్రాంఛైజీలో సినిమాలు వస్తున్నాయి. అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్-2’ కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాల నిర్మాత నానినే స్వయంగా హీరోగా మారి ‘హిట్-3’ చేస్తున్నాడు. అందులో అతను అర్జున్ సర్కార్ అనే వయొలెంట్ కాప్ రోల్ చేస్తున్నాడు.
ఈ సినిమా టీజర్, ఇతర ప్రోమోలు భలేగా అనిపించాయి. గత రెండు చిత్రాల్లో మాదిరే చివర్లో నెక్స్ట్ పార్ట్‌కు లీడ్ ఇవ్వడం.. హిట్-4 కూడా రావడం పక్కా అనే అనుకుంటున్నారు. ఐతే హిట్-3 రిలీజ్‌కు చాన్నాళ్ల ముందే హిట్-5 గురించి ఒక క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. హిట్-3 చివర్లో నెక్స్ట్ పార్ట్ హీరో గురించి ఇచ్చే హింట్ గురించి ఇప్పుడో బజ్ క్రియేట్ అయింది.
హిట్ సిరీస్‌లో తొలి రెండు సినిమాలు క్లాస్ టచ్‌తోనే సాగాయి.
‘హిట్-3’లోకి నాని రాకతో కొంచెం మాస్ టచ్ వచ్చింది. ‘హిట్-4’ ఇంకా మాస్‌గా ఉండబోతోందని సమాచారం. అందుకు తగ్గట్లే హిట్-3 చివర్లో తర్వాతి పార్ట్ మాస్‌గా ఉండబోతోందని చూపిస్తారట. మరి ఆ హీరో ఎవరన్నది ‘హిట్-2’లో నానిని చూపించినట్లే చూపించేస్తారా.. లేక సస్పెన్సులో పెడతారా అన్నది క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు హిట్-4లో నటించే ‘మాస్’ హీరో ఎవరు అనే చర్చ మొదలైంది.
కొందరేమో ‘మాస్ రాజా’ రవితేజ ఈ పాత్ర చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంకొందరేమో ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అని పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను ఈ చిత్రంలో హీరోగా పెట్టడం ద్వారా పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. వీళ్లిద్దరిలో ఎవరు ఈ సినిమా చేసినా సినిమాకు వచ్చే హైపే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ హీరోలకు కూడా ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పాలి.