భారత దేశ పౌరులకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని నివాసం ఉండేందుకు అనుమతించడం లేదు.
అక్కడి రాష్ట్రాల సంస్కృతులు.. సంప్రదాయాలకు విఘాతం కలుగుతాయనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు ఇతర భారతీయ పౌరులపై నిషేధం అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు జమ్ము కశ్మీర్, మణిపూర్.. వంటి చోట్ల అక్కడి పౌరులు మాత్రమే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు, ఆస్తులు కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఉంది.
భారతీయ పౌరులే అయినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. కొన్ని రాష్ట్రాల్లో ఉండేందుకు, ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆఖరుకు పారిశ్రామికేతల వ్యాపారాలు చేసేందుకు కూడా నిషేధం ఉంది. అయితే.. ఇప్పుడు వీటిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఈ దేశంలో ఎక్కడైనా నివసించేందుకు, స్వేచ్ఛగా సంచరించేందుకు పౌరులకు ప్రాథమిక హక్కు ఉంటుందని, పసలేని కారణాలపై దాన్ని నిరాకరించరాదని సుప్రీంకోర్టు తెలిపింది. అది కూడా మహారాష్ట్రకు చెందిన వివాదంలో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.
విషయంలోకి వెళ్తే.. రహమత్ ఖాన్ అనే జర్నలిస్టు నిర్దేశిత సరిహద్దులు దాటి వెళ్ళరాదని కట్టడి చేస్తూ మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అధికారులు జారీ చేసిన ఎక్స్టెర్న్మెంట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. శాంతిభద్రతలను కాపాడేందుకు అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
అంతేతప్ప.. సంప్రదాయాలు.. సంస్కృతులకు.. విఘాతం కలిగించడం.. లేదా అక్కడి ప్రజలను రెచ్చగొడతారనే భయంతో ఎవరినీ నిలువరించలేరని.. పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు విధిస్తున్న నిషేధం ఇక, తొలిగిపోతుందని అంటున్నారు న్యాయ నిపుణులు. ఇది మంచి పరిణామంగా చెబుతున్నారు.