sudigali sudheer and allu arjun
మీడియాను జనాలు మర్చిపోయేలా తన సత్తా చాటుతోంది సోషల్ మీడియా.
ఎందుకంటే.. తోపులాంటి మీడియా సోషల్ మీడియా ముందు చిన్నబోవటమే కాదు.. ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే అంశాల్ని స్టోరీలుగా డెవలప్ చేయటం తెలిసిందే.
హీరోను జీరో చేయటం.. జీరోను కాస్తా ఓవర్ నైట్ లో హీరోను చేయటంలో సోషల్ మీడియా చూపే సత్తా అంతా ఇంతా కాదు.
తాజాగా అలాంటి మేజిక్ ఇన్సిడెంట్ ఒకటి ట్విటర్ ఖాతాలో చోటు చేసుకుంది.
తెలుగు మాత్రమే తెలిసిన వారి సంగతే తీసుకుంటే మీకు అల్లు అర్జున్ తెలుసా? అంటే ఇదేం ప్రశ్న అంటూ ఎదురు ప్రశ్నించటమే కాదు.. ఎర్రి ముఖం పెట్టుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది.
ఇక.. నిత్యం ఏదో ఒక టీవీలో మేల్ యాంకర్ గా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ను గుర్తు పట్టలేని వారే ఉండరు.
నిజానికి అల్లు అర్జున్ కు సుడిగాలి సుధీర్ కు ఏ మాత్రం పోలికే కాదు.
బన్నీ వెండితెరను ఏలేస్తుంటే.. బుల్లి తెరలో ఒక వెలుగు వెలుగుతున్నాడు సుడిగాలి సుధీర్.
ఇలా ఏ మాత్రం సంబంధం లేని..పోలికకు సరిపోని ఈ ఇద్దరికి సంబంధించిన విచిత్రమైన కాంపిటిషన్ ను ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో ఒక యూజర్.
ఇంతకీ ఈ సర్వే ఏ అంశం మీదనంటే..‘‘మీకు ఎవరంటే ఇష్టం.. ఓపెన్ గా చెప్పేయండి’ అని చెబుతూ బరిలో ఇద్దరు ప్రముఖుల పేర్లను పెట్టేశారు.
వారిలో ఒకరు బన్నీ అలియాస్ పుష్ప కేరాఫ్ అల్లు అర్జున్ ఒకరైతే.. రెండో వ్యక్తి అంటే ఎవరూ ఊహించని టీవీ యాంకర్ సుడిగాలి సుధీర్ ను రంగంలోకి తీసుకొచ్చారు.
ఈ పోల్ ఫలితం అనూహ్యంగా ఉండటమే కాదు.. ఆసక్తికరంగా మారింది.
మొత్తం ఈ పోల్ లో 43 వేల మంది ఓట్లు వేస్తే.. వీరిలో 69 శాతం మంది సుడిగాలి సుధీర్ కు ఓట్లు వస్తే.. పుష్పకు మాత్రం 31 శాతం ఓట్లు వచ్చాయి.
దీంతొ స్క్రీన్ షాట్ తీసి మరీ పోస్టులు పెడుతూ.. తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొందరు సుడిగాలి సుధీర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు బన్నీ ఫ్యాన్స్ తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇలాంటివేళ.. ఎన్నికల్లో సుడిగాలి సుధీర్ కున్న ఇమేజ్ మీదా చర్చ మొదలైంది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి ఎదిగిన వైనం నెటిజన్లలో పలువురిని ఆకట్టుకుంటుంది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సుధీర్ ఎదిగారు.ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఏమైనా బన్నీకి.. సుడిగాలి సుధీర్ కు లింకు పెట్టేసిన ఈ యూజర్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నారు.
ఏమైనా సుడిగాలి సుధీర్.. అతడి అల్లరి ఎంత పాపులర్ అన్న విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.