రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించింది. రాష్ట్రంలో ప్రధానంగా తలనొప్పిగా మారి ఉద్యోగుల ఉద్యమాలు, కెసినో వ్యవహారంతో జనం దృష్టిని మరల్చడానికి జగన్ చేసిన ఈ ప్రయత్నం కొంత మేర విజయవంతం అయ్యిందని చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఆరుగా విభజిస్తూ ఏపీ సర్కారు ప్రకటన చేసింది. అభ్యంతరాలుంటే చెప్పడానికి ప్రభుత్వం ఒక నెల సమయం ఇచ్చింది.
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుందని గవర్నర్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనికి తాజాగా కేంద్రం బ్రేకులు వేసింది.
జూన్ వరకు ప్రస్తుత గ్రామాలు, జిల్లాల సరిహద్దులను మార్చవద్దని కేంద్ర గణాంక శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
గత ఏడాది జనాభా గణన పూర్తి కావాల్సి ఉండగా మహమ్మారి, వ్యాక్సినేషన్ కారణంగా జాప్యం జరిగింది. జనాభా గణన సక్రమంగా జరిగేలా చూడడం ప్రస్తుత ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
అంటే ఉగాదికి జగన్ టార్గెట్ మిస్ అవుతుంది. ఈ సమయాన్ి వివిధ అభ్యంతరాలపై అధ్యయం చేయడానికి ప్రభుత్వం వాడుకోవచ్చు. జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో జరుగుతున్న వివిధ నిరసనల గురించి సమాచారాన్ని పంపాలని మౌఖికంగా ఆదేశించారు. మరి ఏం చేస్తారో చూడాలి.