చరిత్ర సృష్టించిన.. మహారాష్ట్ర పులి.. శివసేన మరుగున పడింది. దివంగత బాల ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ రెండు గా చీలిపోయింది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన. `విల్లంబు` బుట్ట దాఖలైంది. కొన్ని దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజలు `పులి`గా ప్రేమించిన.. పులి చిహ్నం కూడా.. చరిత్రలో కలిసిపోయింది.
శివసేన చీలిక వర్గాలకు కొత్తపేర్లు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ‘కాగడా’ గుర్తును కేటాయిస్తూ ప్రకటన వెలువరించింది. ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును ఠాక్రే వర్గానికి కేటాయించింది. కాగా, ‘బాలాసాహెబంచి శివసేన’ అన్న పేరును శిందే వర్గానికి కేటాయించింది ఈసీ. కొత్త ఎన్నికల గుర్తు ఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు ‘త్రిశూలం’, ‘గద’ గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది.
ఇవి మతపరమైన గుర్తులను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో వాటిని పక్కనబెట్టినట్లు స్పష్టం చేసింది. ‘శివసేన’ పేరు, ఆ పార్టీ గుర్తు అయిన ధనస్సు-బాణంను ఎలక్షన్ కమిషన్ను స్తంభింపచేసింది ఈసీ. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కొత్త పేర్లు, పార్టీకి గుర్తులకు సంబంధించి ఐచ్ఛికాలు సమర్పించాలని ఇదివరకే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఇరు పార్టీ ఇరువర్గాలు తమకు కేటాయించాల్సిన గుర్తులపై ఐచ్ఛికాలను ఈసీకి సమర్పించాయి.
త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం కోరింది. శిందే వర్గం సైతం తమ ఐచ్ఛికాలను సమర్పించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పార్టీ గుర్తుగా ‘గద’ను కేటాయించాలని శిందే వర్గం కోరినట్లు.. తాజా ఈసీ ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
ఇవీ తాజా గుర్తులు..
ఏక్నాథ్ శిందే పార్టీ అంధేరీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి.. ఎన్నికల సంఘం జోడు కత్తుల బల్లెం గుర్తును కేటాయించింది. శిందే వర్గం మూడు ఐచ్ఛికాలను ఈసీకి పంపగా.. ఈసీ ఈ గుర్తును ఖరారు చేసింది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వెలుగుతున్న కాగడా గుర్తును ఈసీ కేటాయించింది. ఈ కొత్త గుర్తులతో ప్రస్తుతం రెండు పార్టీలు ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నాయి.