పాపం జనసేన. ఆ పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేనదే నిర్ణయాధికారం అని కలలు కంటున్న ఆ కేడర్ కు అది కేవలం పగటి కలే అని, ఆ పార్టీ ఎవరి మీదో ఆధారపడక తప్పదని తేలిపోయింది.
ఎన్నికల కమిషన్ గుర్తింపును ఆ పార్టీ కోల్పోయింది. సింపుల్ గా చెప్పాలంటే… జనసేన పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లతో సమానం. ఆ పార్టీ తమ గుర్తుగా భావిస్తున్న గాజు గ్లాసు ఎవరికైనా రావచ్చు.
ఎందుకిలా అంటే… ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉంటేనే ఒకే గుర్తు వస్తుంది. ఎన్నికల కమిషన్ గుర్తింపు కావాలంటే నిర్ణీత సంఖ్యలో ఓట్లు సీట్లు తెచ్చుకోవాలి. ఆ పార్టీ దానిని రీచ్ కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్ జనసేన గుర్తింపును రద్దు చేసింది.
అంటే ఈసీ దృష్టిలో జనసేన అనే పార్టీ లేదు. జనసేన అభ్యర్థులను ఈసీ స్వతంత్ర అభ్యర్థులుగానే గుర్తిస్తుంది. ఈసారి జనసేన స్వతంత్రంగా కనుక పోటీ చేస్తే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తు లభిస్తుంది. అది పార్టీకి అతిపెద్ద ప్రమాదం కింద లెక్క.
దీంతో జనసేన నాయకత్వానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.