• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

NA bureau by NA bureau
March 31, 2023
in Andhra, Telangana, Top Stories, Trending
0
Vande Bharat Express

Vande Bharat Express

0
SHARES
456
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సంక్రాంతి సందర్భంగా తెలువారికి మోడీ సర్కారు ఇచ్చిన బహుమతిగా విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ను అందుబాటులోకి తేవటం తెలిసిందే. తాజాగా మరో వందే భారత్ ను తెలుగు రాష్ట్రాలకు బహుమతిగా కేంద్రం ఇస్తోంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడుస్తుంది. ఏప్రిల్ 9 నుంచి పట్టాల మీద పరుగులు తీయనున్న ఈ రైలుకు సంబంధించిన టైమింగ్స్ ను వెల్లడించారు.

వారంలో మంగళవారం మినహా మిగిలినఅన్ని రోజుల్లోనూ ఈ రైలు తిరుగుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటికి అందుబాటులో ఉన్న ట్రైన్లలో ఈ మార్గంలో కనిష్ఠంగా 11 గంటలు గరిష్ఠంగా 15 గంటల ప్రయాణం ఉంది. అందుకు భిన్నంగా వందేభారత్ రైలుమాత్రం కేవలం 8.30 గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించనుంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రజలకు శుభవార్తగా మారిన ఈ వందే భారత్ కు సంబంధించిన ఒకే ఒక్క సమస్య ఏమంటే.. టైమింగ్స్ సరిగా లేకపోవటం అన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. సికింద్రాబాద్ లో తెల్లవారుజామున ఆరు గంటలకు బయలుదేరే ఈ ట్రైన్ తిరుపతికి వెళ్లే సరికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరే ట్రైన్ సికింద్రాబాద్ చేరుకునేసరికి అర్థరాత్రికి కాస్త ముందుగా 11.45 గంటలకు చేరుకుంటుంది. ఉదయాన్నే మరికాస్త ముందు బయలుదేరి మధ్యాహ్నం కాస్త ముందుగా చేరుకుంటే.. సాయంత్రం వేళకు దర్శనం పూర్తి చేసుకొని.. రాత్రికి బయలుదేరి తర్వాతి రోజుకు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ.. ప్రస్తుత టైమింగ్స్ ఏ మాత్రం సెట్ కావన్న మాట వినిపిస్తోంది.

తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వచ్చే ట్రైన్ ను చూస్తే.. రాత్రి 11. 45 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఒకవేళ పావు గంట నుంచి అరగంట ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటే.. ఇంటికి చేరుకునే సరికి అర్థరాత్రి ఒంటి గంటకో కానీ చేరుకోలేని పరిస్థితి. ఆ సమయంలో ప్రయాణికులు ఆటోల్లోనూ.. క్యాబ్ లోనూ ఇంటికి చేరటం కష్టమే కాదు.. ఖర్చుతోకూడుకున్న పనిగా మారుతుంది. టికెట్ డబ్బులు ఎంత అవుతాయో..సికింద్రాబాద్ రైల్వే  స్టేషన్ నుంచి ఇంటికి చేరేందుకుక్యాబ్ కు అయ్యే ఖర్చు ఒకేలా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. వందే భారత్ ట్రైన్ రావటం వరకు బాగానే ఉంది కానీ.. దాని టైమింగ్స్ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక.. టైమింగ్స్ విషయానికి వస్తే..

సికింద్రాబాద్ – తిరుపతి వందే బారత్ కు 20701 నెంబరును కేటాయించారు.

ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది

ఉదయం 7.19 గంటలకు నల్గొండకు చేరుతుంది

గుంటూరుకు ఉదయం 9.45 గంలలకు చేరే ఈ ట్రైన్ ఒంగోలుకు 11.09 గంటలకు చేరిపోతుంది.

నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు.. తిరుపతికి2.30 గంటలకు చేరుంది.

తిరుగు ప్రయాణం విషయానికి వస్తే తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ కు 20702 నెంబరునుకేటాయించారు.

మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.

నెల్లూరుకు సాయంత్రం 5.20 గంటలకు.. ఒంగోలుకు 6.30 గంటలకు.. గుంటూరుకు 7.45 గంటలకు చేరుతుంది.

నల్గొండకు రాత్రి10.10 గంటలకు.. తిరుపతికి 11.45 గంటలకు చేరుకుంటుంది.

 

Tags: Secunderabadvande bharat trainvizag
Previous Post

జగన్ పై పోస్టు పెడితే… ఎన్నారైపై హోమో సెక్సువల్ కేసా?

Next Post

ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!

Related Posts

Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Top Stories

జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Load More
Next Post
tdp and ycp logos

ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra