????Get to Know the 13 Sankashti Chaturthis
Sankashti Chaturthi, also known as Sankatahara Chaturthi, dedicated to worship Ganesha. Fourth day of Krishna Paksha. If Chaturthi falls on a Tuesday, it is called Angaraki Sankashti Chaturthi#TempleConnect #Ganpati #Ganesha pic.twitter.com/EIQDuJAM99
— Temple Connect Official (@TempleConnect_) January 10, 2023
కొందరికి ఏం చేసినా కలసిరావు. అలాంటి వారు తమ దురదృష్టాన్ని తలచుకుని ఫీలవుతుంటారు. కానీ ఇలాంటి వారికి ఉపశమనం కలిగించే మార్గం ఒకటుంది. జీవితంలో అడ్డంకులు తొలగించుకోవడానికి మానవ ప్రయత్నం ఎంత అవసరమైన దేవుడి ఆశీర్వాదం అంతే అవసరం.
మనం ఏ కార్యం చేపట్టినా నిర్విఘ్నంగా జరగాలి అంటే శ్రీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి. జీవితంలో నిత్యం ఎదురయ్యే అడ్డంకులతో విసిగిపోయిన వారికి ఆ శ్రీ విఘ్నేశ్వరుడి సాయంతో వాటిని అధిగమించడానికి ఏడాదికి కొన్ని సార్లు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం దగ్గర్లో మార్చి 11న ఉంది. మార్చి 11 శనివారం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి, దీనిని సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు.
ఈ విశిష్టమైన రోజు శ్రీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందడానికి సుముహర్తం. సంకష్ట హర చతుర్థి రోజున విఘ్నాలు తొలగించే శ్రీ గణపతిని పూజిస్తే భక్తుల ఆటంకాలను తొలగించి వారిని కష్టాలను స్వామి వారు ఖచ్చితంగా గట్టెక్కిస్తారు.
ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే శనివారం మార్చి 11 న ఆది పూజ గ్రహీతుడు అయిన శ్రీ మహా గణపతికి సంకష్ట హర చతుర్థి పూజ జరిపించండి. అన్ని గణపతి ఆలయాల్లో ఈ ప్రత్యేక పూజను చేస్తారు. వీలైతే జీవితంలో ఒకసారి ఈ పూజను శ్రీ కాణిపాకం పుణ్యక్షేత్రంలో చేయిస్తే ఇంకా మంచిది.