ఫిబ్రవరి 3 బుధవారం తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఇందులో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని , హిందూ మతాన్ని , హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే విధంగా మరీ ముఖ్యంగా పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య కార్యాచరణకు కు పటిష్ఠ విశాల వేదికను రూపొందించేందుకు ఉద్దేశించిన సమాలోచనల పరంపరలో ఇది మొదటిది . అందుబాటులో ఉండి , చప్పున కలిసేందుకు అంగీకరించిన కొద్దిమంది ప్రసిద్ధ పీఠాధిపతులతో తొలి సమావేశం జరిగింది.
ఇందులో పాల్గొన్న వారిలో ఈ కింది ప్రముఖులు ఉన్నారు:
1.కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి వారు.
2.దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిథిగా శృంగేరి శారదా పీఠం ఎడ్మినిస్ట్రేటర్ శ్రీ గౌరీశంకర్ గారు.
3.హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు.
4 పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామివారు
5.తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు.
6.అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిథి ………
7.శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మహాస్వామివారు
8.శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి ముత్తీవి సీతారాం గురువర్యులు.