ఈ పొలిటికల్ మీట్ ... ఏపీ పెద్దమనిషిని బాగా ఇరిటేట్ చేసిందటగా

కొన్ని దృశ్యాలు జీర్ణించుకోవడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడితే, ఎన్నో రోజులు వెయిట్ చేస్తే తప్ప కొందరికి అప్పాయింట్ మెంట్లు దొరకవు. పాపం రాజుగారికి ఏమో అడిగిన తక్షణం  అపాయింట్మెంట్ ఆప్యాయతాపూర్వక పలకరింపులు.

బహుశా ఈ ఫొటోలు చూసి ఏపీ సీఎం ఎంత కలవరపడి ఉంటారో. తన ప్రమేయం లేకుండా తన పార్టీలో గెలిచిన ఎంపీ ఇండియా హోంమంత్రి అమిత్ షా ని కలవడం సాధారణ విషయమా? ఏపీలోనే కాదు, దాదాపు ఏ ప్రాంతీయ పార్టీలోని నేతలకు ఇది సాధ్యపడదు. ఒకవేళ జరిగినా అది ఆ పార్టీ చేతనే జరగాలి.

కానీ RRR కి కలవడమే కాదు, ముచ్చట్లు పెట్టడం కూడా వచ్చు. ట్విస్టేమిటంటే.... అమరావతి గురించి మాట్లాడటం జరిగిందట. అమిత్ షాను ఏపీ పర్యటనకు కూడా విచ్చేయమని రాజుగారు పిలవడం అమిత్ షా అంగీకరించడం కొసమెరుపు.

ఇంతకుమించిన హైలెట్ ఒకటుందండోయ్... ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడి వేగంగా లేదని, దానిపై జోక్యం చేసుకుని దేవాలయాలపై దాడికి కారణాలను, నిందితులను కనిపెట్టాలని హోంశాఖను కోరారు రాజుగారు. అమ్మో... వాళ్లా పని చేస్తే చాలామందికి హ్యాపీగానే ఉంటుంది. కానీ కొందరికి ఇష్టం లేదు. ఆ కొందరు ఎవరో మీకూ తెలుసుగా... ఇక్కడ ప్రత్యేకంగా రాయడం ఎందుకు.?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.