సమంత రూత్ ప్రభు అల్లు అర్జున్ చిత్రం పుష్ప ఐటెం సాంగ్… ‘‘ఊ అంటావా మామా..ఊ ఊ అంటావా మామా‘‘లో తన నటనతో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఆమెను ఈ పాటను చూసిన వారు. సోషల్ మీడియాలో ప్రశంసించడంలో బిజీగా ఉండగా, ఒక నెటిజన్ సమంతను ట్రోల్ చేయబోయి… చివరకు అందరి చేత తిట్లు తిన్నాడు.
ఆమె విడాకుల వ్యవహారంపై కామెంట్ చేసిన ఆ నెటిజన్ నీచమైన పదాలతో ఆమెను డీ గ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు. సాధారణంగా తన సోషల్ మీడియా ట్రోల్‌లను పట్టించుకోని సమంత రూత్ ప్రభు, ట్విట్టర్ యూజర్‌కి ఈ సాధారణ పదాలతో సమాధానం ఇచ్చింది: “దేవుడు నీ ఆత్మను ఆశీర్వదిస్తాడు.” అంటూ అతనికి రిప్లై ఇచ్చింది.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021
ఈ ట్వీట్‌ను తొలగించిన నెటిజన్‌కు కొందరు అభిమానులు తగిన సమాధానం కూడా ఇచ్చారు. దెబ్బకు నెటిజన్ పారిపోయాడు.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ట్రోల్‌లతో తనకు ఎదురైన కష్టాల గురించి సమంతా అనుపమ చోప్రాతో మాట్లాడుతూ, “ది ఫ్యామిలీ మ్యాన్ టైం నుంచి ట్రోలింగ్ చేసినప్పటికీ, నేను వాటిపై స్పందించను. నేను ఎప్పుడూ అలానే ఉన్నాను. నేను ఇలాంటి ప్రతిదానికి నేను స్పందించను” అని చెప్పింది.
34 ఏళ్ల సమంత సోషల్ మీడియాలో “ట్రోల్స్ కి” దూరంగా ఉండటానికి ఇష్టపడుతుందట.
నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు మరియు నాకు ఏదైనా చెప్పాలని అనిపించినప్పుడు నేను మాట్లాడతాను. అంతేగాని ఎవరో బుల్డోజ్ చేస్తే నలిగిపోయే రకం కాదని చెప్పింది.
ఏడాది అక్టోబర్‌లో సమంత రూత్ ప్రభు మరియు నటుడు నాగ చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారు. వారు 3 సంవత్సరాల క్రితం వీరు వివాహం చేసుకున్నారు.