• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘నా కొడకా’ అంటూ దారుణంగా కొట్టేసిన సుభాని అరెస్టు

admin by admin
December 22, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
225
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బూతులు తిట్టలేదు. దారుణ వ్యాఖ్యలు చేయలేదు. ఆ మాటకు వస్తే ఉన్నది ఉన్నట్లుగా చెప్పి.. ‘అన్నా.. ఈ యాంగిల్ లో ఆలోచించు. పార్టీకి మంచి జరుగుతుంది. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదు. పార్టీ మళ్లీఅధికారంలోకి వస్తుంది’ అంటూ సూచనలు చేస్తే ఎవరైనా ఏం చేస్తారు? అన్న ప్రశ్నను సంధిస్తే సమాధానం ఇట్టే చెప్పేస్తారు. అలా చేస్తే అది వైసీపీ ఎందుకు అవుతుందన్నట్లుగా సీన్ చోటుచేసుకోవటం తెలిసిందే.

పార్టీ నేతగా.. పార్టీ గురించి ఆలోచించే వ్యక్తిగా మాట్లాడిన ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను.. ఇష్టారాజ్యంగా తిట్టటమే కాదు.. దారుణంగా కొట్టిన వైనానికి సంబంధించిన వీడియో బయటకు రావటం.. రచ్చ రచ్చగా మారటం తెలిసిందే.

ఈ మొత్తం వ్యవహారంలో సుబ్బారావు గుప్తాపై  దాడికి పాల్పడిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానిపై అతి కష్టమ్మీద కేసు నమోదు కావటం తెలిసిందే. అతడి తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. అతగాడు చేసిన పనికి సారీ చెప్పాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. ఆయన్ను ఇంకా అరెస్టు చేయకపోవటం ఏమిటంటూ ప్రశ్నలు సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున వినిపించాయి.

సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే.. యుద్ద ప్రాతిపదికన అరెస్టు చేసే వరకు ఆగని పోలీసులు.. సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ లో ఇంత జరిగినా.. ఎందుకు కామ్ గా ఉన్నారన్న వాదన సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సాగింది. అంతేకాదు.. రాజకీయ వర్గాల్లోనూ ఇదే ప్రశ్న వ్యక్తమైంది. జరిగిన దారుణంపై వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటమే కాదు.. ఇప్పుడున్న సమస్యలు సరిపోనట్లు.. ఇంత ఓవరాక్షన్ అవసరమా? అన్న ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో.. సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడిన సుభానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

తనపై దాడి చేసిన సుభానిపై ఒంగోలు వన్ టౌన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుబ్బారావుకు కూసింత ఊరట కలిగించేలా ఆయన్ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ ఏమంటే.. సుభాని చేతిలో దెబ్బలు తిన్న సుబ్బారావును విజయవాడలో జరిగిన సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం తీసుకెళ్లటం.. కేక్ కట్ చేసి సుబ్బారావు నోట్లో పెట్టారు.

ఆ సమయంలో సుబ్బారావును నా కొడకా.. అంటూ తిట్టి.. అమానుషంగా కొట్టేసిన సుభాని సైతం అక్కడే ఉండటం. ఈ తీరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఏమైందో కానీ.. అమానుష దాడికి పాల్పడ్డ సుభానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

కొసమెరుపు – ఇంతా చూస్తే అతనిని అరెస్టు చేసిన వెంటనే స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు.

Tags: balineniOngolesubhaniycpYSRCP
Previous Post

Samantha: సమంత దెబ్బకు వాడు పరార్

Next Post

కేసీఆర్ అవినీతిపై అమిత్ షా హాట్ కామెంట్స్.. ఏం జరగబోతోంది

Related Posts

avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
mahasena rajesh
Andhra

మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్

May 27, 2023
anam venkataramana
Andhra

వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !

May 27, 2023
mahanadu2023 tdp
Andhra

`నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..

May 27, 2023
Trending

అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

May 27, 2023
Load More
Next Post

కేసీఆర్ అవినీతిపై అమిత్ షా హాట్ కామెంట్స్.. ఏం జరగబోతోంది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?
  • తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలకు ఇళ్లు ఇవ్వరెందుకు జగన్?
  • హైకోర్టులో తర్జనభర్జనలు…అవినాష్ రెడ్డికి షాక్
  • ఆర్-5 జోన్ లో హై టెన్షన్…భగ్గుమన్న అమరావతి!

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra