• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ కు ఓటు వేయాలని చిరంజీవి పిలుపు..వైరల్

admin by admin
May 7, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
45
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలకు అన్నయ్య చిరంజీవి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కు ఓటు వేయాలంటూ చిరంజీవి ఎక్స్ వేదికగా పంపిన వీడియో ట్రెండ్ అవుతోంది.

“కొణిదెల పవన్ కల్యాణ్… అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా… అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్… తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం… ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.

సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.

ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే… పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి. సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించండి. జైహింద్” అని చిరంజీవి వీడియోలో సందేశమిచ్చారు.

ఆల్రెడీ మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు పవన్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సుజనా చౌదరి,పంచకర్ల రమేష్ లకు మద్దతుగా వీడియో విడుదల చేసిన చిరు…తాజాగా తమ్ముడు పవన్ కోసం రంగంలోకి దిగడం విశేషం.

జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t

— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024

Tags: chiranjeevijanasenapithapuramsupporting pawanviral videovote for pawan
Previous Post

నమస్తే ఆంధ్ర ఈ పేపర్ – మే 2024

Next Post

బాబాయ్ కు ఓటేయాలని అబ్బాయ్ రామ్ చరణ్ రిక్వెస్ట్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

బాబాయ్ కు ఓటేయాలని అబ్బాయ్ రామ్ చరణ్ రిక్వెస్ట్

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra