కొన్నేళ్ల ముందు వరకు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో మురుగదాస్ ఒకడు. తమిళంలో రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లు.. హిందీలోనూ గజిని రీమేక్‌తో మరో బ్లాక్‌బస్టర్ తీసి తిరుగులేని డిమాండ్‌తో ఉండేవాడు. కానీ స్పైడర్ నుంచి అతడి కెరీర్ తిరగబడింది. ఆ తర్వాత వచ్చిన సర్కార్, దర్బార్ మురుగదాస్‌ను ఇంకా కిందికి లాగేశాయి.
దర్బార్ తర్వాత మురుగదాస్ నుంచి సినిమానే రాలేదు. మూడేళ్లు ఖాళీగా ఉండిపోయాడు. ఇటీవలే తన స్థాయి తగ్గించుకుని శివ కార్తికేయన్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈలోపు మురుగదాస్‌కు ఓ పెద్ద హిందీ సినిమాలో ఛాన్స్ దక్కినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడా వార్త అధికారికంగా ఖరారైంది.
అనుకున్నట్లే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో మురుగదాస్ సినిమా చేయబోతున్నాడు. వీరి కలయికలో రాబోతున్న సినిమాకు సికందర్ అనే టైటిల్ కూడా ఖరారైంది. ఈ చిత్రాన్ని సల్మాన్ మిత్రుల్లో ఒకడైన అగ్ర నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఐతే ఈ చిత్రం కిక్ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం సాగింది. కానీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఇది ‘కిక్-2’ అనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు.
కిక్ సీక్వెల్ అయితే కిక్-2 అనే టైటిల్ పెట్టేవారేమో. టైటిల్ మారినంత మాత్రాన కిక్ ఛాయలు ఉండవని కూడా కచ్చితంగా చెప్పలేం. ప్రతి రంజాన్‌కు తన కొత్త సినిమా రిలీజ్ చేయడం అలవాటైన సల్మాన్.. ఈసారి పండుగను అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్‌లకు వదిలేశాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం సికందర్ మూవీతో పలకరించబోతున్నాడు. త్వరలోనే శివకార్తికేయన్ మూవీని పూర్తి చేసి ఈ ప్రాజెక్టు మీదికి వెళ్లబోతున్నాడు మురుగదాస్.