రాజకీయం పేరుతో ఏం చేసినా దాన్ని రాజకీయంగా చూస్తే ఏం జరుగుతుంది? చావు తిట్లు తిట్టే చంద్రబాబు అవుతారు.
నిజమే.. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఊరి వేయాలని.. రాళ్లతో కొట్టాలని పిలుపు ఇచ్చినప్పుడు.. తమ అభిమాన ముఖ్యమంత్రిని ఉద్దేశించి నాటి ప్రతిపక్ష నేత చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. టీడీపీ అభిమానులు స్పందించి.. అంతటి దారుణ వ్యాఖ్యలకు ప్రతిగా వైసీపీకి చెందిన పార్టీ కార్యాలయాల మీదా.. పార్టీ నేతల ఇళ్ల మీదా..తాడేపల్లిలోని సీఎం ఇంటి మీదా పెద్ద ఎత్తున దాడికి పాల్పడినా మౌనంగా ఉండేవారు. ఎందుకంటే.. తాము అన్న అంతటి తీవ్రమైన మాటకు ఆ మాత్రం ‘ప్రతిచర్య’ అంటుందన్న విషయాన్ని అర్థం చేసుకునే వారు.
కానీ.. అలాంటిదేమీ చేయకుండా.. ప్రతీకార ధోరణిని ప్రదర్శించాలన్న మాటకు చెక్ చెప్పటం చంద్రబాబు చేతకానితనమే అవుతుంది.
దుష్ట..దుర్మార్గమైన చంద్రబాబును తిట్టటమే పనిగా పెట్టుకున్న ఏపీ అధికారపక్షం.. ఆయన సర్కారులో తీసుకున్న నిర్ణయాల మీద ఇప్పటికే బోలెడంత స్కానింగ్ చేసినా.. అందులో ఎలాంటి తప్పుల్ని ఎందుకు పట్టుకోలేనట్లు?
టీడీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయలేదన్న విషయాన్ని గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం తన చర్యలతో స్పష్టం చేసినట్లే కదా?
తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి అనూహ్యమైన ప్రకటన చేశారు.
టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గుండెలు రగిలిపోయి.. టీడీపీ ఆఫీసుల మీదా.. టీడీపీ నేతల మీద దాడులకు పాల్పడిన ఉదంతాలు చోటు చేసుకున్న వేళ.. మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు.
సీఎం జగన్ ను ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ.. ఈ నెల 21, 22 (ఇవాళ రేపు) జనాగ్రహ దీక్షల్ని నిర్వహించేందుకు డిసైడ్ చేసిన విషయాన్ని సజ్జల మాష్టారు ప్రకటించారు.
దాడులు చేయటమే కాదు.. దాన్ని సమర్థించుకోవటం ఒక ఎత్తు అయితే.. అలాంటి వాటికి కౌంటర్ గా జనాగ్రహ దీక్షలు నిర్వహించాలన్న తెలివితేటలు లేని చంద్రబాబు.. ఇప్పటికైనా సజ్జల వారి చర్యల్ని చూసైనా నేర్చుకుంటున్నారు కదా?