• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘సాక్షి’ … వీటికి సమాధానం చెప్పగలదా?

‘సాక్షి’లో రాసినవే ... అయినా జగన్ వద్ద సమాధానాల్లేవు

admin by admin
October 21, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
415
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘‘మోదీ, అమిత్‌షాను తిట్టి, అమిత్‌షా కారు మీద రాళ్లు వేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తాడట. చంద్రబాబు ఎలాంటి వాడో వారికి తెలియదా? పోసాని కృష్ణ్ణమురళి ఇంటి మీద దాడి జరిగితే, చంద్రబాబు మాట్లాడలేదు. పవన్‌ కళ్యాణ్‌ కనీసం ఖండించలేదు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు విరిగి, అద్దాలు పగిలితే వెంటనే పవన్‌ కళ్యాణ్‌ స్పందించాడు. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరాడు. దీన్ని బట్టి పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ఒకటేనని అర్థమవుతోంది’’

‘‘నిన్నటి ఘటనలు ఎందుకు జరిగాయో అందరూ ఆలోచించాలి. ఇందుకు ఎవరు కారణమో అర్థమవుతుంది. రియాక్షన్‌ ఎందుకు వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది. కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తున్న నాయకుడిని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఓట్లేసి గెలిపించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన బూతులే ఈ ప్రతిచర్యల వెనుక బలమైన కారణాలు.

బోషడీకే అన్నారు. ఇది చాలా పెద్ద బూతు పదం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఒక ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇంత దారుణంగా మాట్లాడితే, ఆ మాటలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతుంటే, వాటిని ప్రజలు చూస్తున్నప్పుడు సహజంగానే తీవ్ర భావోద్వేగాలు చెలరేగుతాయి. ఇది సహజం. ఇక్కడ చంద్రబాబు చేయించినది చర్య అయితే, జగన్‌ అభిమానులు తిరగబడటం కేవలం ప్రతి చర్య’’

– వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాథరాజు, బాలినేని, కన్నబాబు, ఆదిమూలపు సురేష్, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఏపీ అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. ఈ రోజు అధికార పార్టీకి చెంది సొంత మీడియా ‘సాక్షి’లో పబ్లిష్ అయిన అక్షరాలు.

మిగిలిన వాటికి అయితే.. పచ్చ మీడియా అంటూ రంగులేసే అవకాశం ఉంది కాబట్టి.. వారి మాటల్నియథాతధంగా తీసుకుంటే.. దానికి వేరే రంగు వేయటానికి వీలుందని భావిస్తున్నాం. పలువురు మంత్రులతో పాటు సలహాదారు.. పార్టీ అధికార ప్రతినిధి చేసిన ఘాటు వ్యాఖ్యల్ని ఘనంగా పబ్లిష్ చేసుకున్నారు. జరిగిందేమిటన్న విషయాన్ని వారు చెప్పేసి.. వారి అక్షరాల్లోనే వాస్తవాల్ని చెప్పేసిన వైనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చూద్దాం.

–  ‘మోదీ, అమిత్‌షాను తిట్టి, అమిత్‌షా కారు మీద రాళ్లు వేయించిన చంద్రబాబు’.. నిజంగానే అది జరిగి ఉండి ఉంటే.. ఈపాటికి ప్రభుత్వం కేసులు పెట్టాలి కదా? రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తలుపులు బద్ధలు కొట్టి మరీ వెళ్లి అరెస్టు చేసినప్పుడు.. దేశ ప్రధాని మీద దూషణలు.. కేంద్ర హోంమంత్రి కారు మీద రాళ్లు వేసినప్పుడు బాబు మీద హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు ఎందుకు మిస్ అయినట్లు?

–   పోసాని కృష్ణ్ణమురళి ఇంటి మీద దాడి జరిగితే, చంద్రబాబు మాట్లాడలేదు. పవన్‌ కళ్యాణ్‌ కనీసం ఖండించలేదు. ఇదంతా ఎందుకు జరిగింది. పోసాని అన్న పెద్ద మనిషి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ అమ్మను మొదలు కొని కుమార్తె వరకు నోటితో అనలేని మాటల్ని.. రాయలేని రాతల్ని అన్నప్పుడు.. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రాళ్లు విసిరారు. దానికి జరిగిన నష్టం ఎంతో అందరూ ఫోటోలతో సహా చూశారు. సాక్షి పత్రికలో ముఖ్యమంత్రిని వారిని పట్టాభి ఏమని దూషించారన్న  పదాన్ని వారే చెప్పేసుకున్నారు కాబట్టి.. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించట్లేదు. ఆ మాటకు.. పోసాని మాటలకు సంబంధం ఉందా? తన తల్లిని.. భార్యను.. సోదరిని.. కుమార్తెను అనరాని మాటలు అనేసి.. వీరావేశంతో పవన్ చావు ఎలా ఉంటుందో చెప్పేస్తూ.. దారుణ వ్యాఖ్యలు చేస్తే.. పవన్  పోసానికి క్షమాపణలు చెప్పాలా?

–  ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు విరిగి, అద్దాలు పగిలితే వెంటనే పవన్‌ కళ్యాణ్‌ స్పందించాడుని పేర్కొన్నారు. కళ్ల ముందు కనిపించే వీడియోల్లో విషయం మొత్తం కనిపిస్తున్నా.. సింఫుల్ గా రెండు కుర్చీలు.. అద్దాలు పగిలితే.. పవన్ స్పందించాడని అదో తప్పుగా.. బూతుగా చెప్పేస్తున్న మంత్రులు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఏపీ రాష్ట్ర బీజేపీకి చెందిన పలువురు నేతలు సైతం ఖండించారన్నది ఎలా మరుస్తారు? సీపీఐ నేతలు కూడా తీవ్రంగా తప్ప పట్టారు. పార్టీ ఆఫీసును సందర్శించారు. మరి.. వాటిని మాట వరసకు స్పందించనోళ్లు… పవన్ ఖండనను మాత్రమే ఎందుకు ఖండిస్తున్నట్లు?

–  ‘‘కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తున్న నాయకుడిని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఓట్లేసి గెలిపించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన బూతులే ఈ ప్రతిచర్యల వెనుక బలమైన కారణాలు. బోషడీకే అన్నారు. ఇది చాలా పెద్ద బూతు పదం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఒక ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇంత దారుణంగా మాట్లాడితే, ఆ మాటలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతుంటే, వాటిని ప్రజలు చూస్తున్నప్పుడు సహజంగానే తీవ్ర భావోద్వేగాలు చెలరేగుతాయి’’.. పైన కోట్ లో ఉన్న ఏ ఒక్క పదం మాది కాదు.

అన్ని సాక్షిలో ప్రచురితమనవే. వీటి గురించి వద్దాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులే ఈ ప్రతి చర్యలకు బలమైన కారణాలుగా విశ్లేషించారు. అలా చేసింది కూడా గౌరవ స్థానంలో ఉన్న మంత్రులు.. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే సజ్జల. ఆటలో అరటిపండులా ఉండే అంబటిని కాసేపు పక్కన పెట్టేస్తే. ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఉద్దేశించి.. ‘రాళ్ల‌తో కొట్టి చంపాలి’ అన్న మాట.. ఉరి తీయాలి.. లాంటి మాటలు భావోద్వేగానికి గురి చేసేవి కావా? ఒక పదానికే తీవ్ర భావోద్వేగాలు చెలరేగుతాయని చెబుతున్న వారు.. పవన్ కల్యాణ్ ను పోసాని బండ బూతులు తిట్టిన వేళ.. భావోద్వేగానికి గురై ఎలాంటి దాడులు జరగనట్లు? ఒకవేళ జరిగితే.. ఆ రోజున కూడా ఇదే రీతిలో భావోద్వేగంతో జరిగిన దాడులు అని ఊరుకుంటారా?

–  ‘‘ఇక్కడ చంద్రబాబు చేయించినది చర్య అయితే, జగన్‌ అభిమానులు తిరగబడటం కేవలం ప్రతి చర్య’’ అనేసిన ఈ వ్యాక్యంలోని ప్రతి అక్షరం సాక్షి సొంతం. ఇక్కడ కలిగే క్వశ్చన్ ఏమంటే.. చంద్రబాబు చేయించింది చర్యే అన్న మాటతో పాటు అభిమానులు తిరగబడటం కేవలం ప్రతి చర్య అని చెప్పేయటం అంటే.. దాడులకు పాల్పడింది తమ అభిమానులే కానీ గుర్తు తెలియని అల్లరి మూకలు కాదని స్పష్టం చేసినట్లే కదా?

మరి.. అంతటి ఘన కార్యం చేసినందుకు వారికెందుకు సన్మానాలు చేయకూడదు? రాళ్లతో..సుత్తితో..కర్రలతో బాదిన ఆ ముప్ఫై.. నలభై మందికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చే దమ్ము.. ధైర్యం ఉందా? మరంత మహత్తర కార్యం చేసిన వారిని ఆ మాత్రం గౌరవించుకునే విశ్వాసం కూడా లేదా? తమ అభిమానుల ప్రతిచర్యకు కారణమైన బాబు చర్య అన్నది నిజమే అయితే.. ఈపాటికి ఊరుకుంటారా? సదరు వీడియోలతో కథలు.. కథలు అల్లేసే వారు కదా? అన్నింటికి మించి ఆయనపై కేసు పెట్టి లోపలేసేవాళ్లు కదా? మరి.. చర్య చేసిన చంద్రబాబును ఎందుకు వదిలేసినట్లు?

చివరగా ఈ విషయాన్ని ప్రస్తావించి ముగిద్దాం.. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే.. ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించే వారు.. మంత్రులతో సమానం కానే కాదు. మంత్రుల తర్వాతే. అదేందో.. అధికార పార్టీకి చెందిన మీడియాలో పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్ సలహాదారుగా వ్యవహరించే సజ్జల.. మిగిలిన మంత్రుల కంటే ముందు ఉండటం చూస్తే.. ప్రభుత్వంలో మంత్రుల పాత్రేమిటో చెప్పేశారా?

Tags: andhrapradeshsakshiycpYSRCP
Previous Post

అదీ ప్లానింగ్ అంటే.. సజ్జలను చూసి నేర్చుకోవాలి బాబు

Next Post

సీఎం జగన్ ‘హిందువు’… స్వామీజీలు రెకమెండేషన్ ఎందుకంటే

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

సీఎం జగన్ ‘హిందువు’... స్వామీజీలు రెకమెండేషన్ ఎందుకంటే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra