హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురికావడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే.
హైదరాబాద్‌లో స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వెళ్తూ Sai Dharam Tej ప్రమాదానికి గురయ్యారు.
Sai Dharam Tej యాక్సిడెంట్ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఆయన నడిపిన బైక్ ఫొటోలు కూడా వచ్చాయి. దీంతో చాలామంది ఆ బైక్ ఏమిటి? ఆ Bike Cost ఎంత ఉంటుంది, ఎంత speedగా వెళ్తుంది, ఎంత పవర్ ఉంటుంది, దాని ప్రత్యేకతలు ఏమిటి వంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
Sai Dharam Tej నడిపిన బైక్ కంపెనీ పేరు ట్రయంఫ్ (Triumph). సాయి ధరమ్ తేజ్ వాడుతున్న ట్రయంఫ్ బైక్ మోడల్ పేరు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ (Street Triple RS).
Triumph Street Triple RS ధర ఎంత?
Triumph Street Triple RS ధర రూ. 11,61,000 నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షో రూం ప్రైస్. యాక్సెసరీస్, రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపితే ధర ఇంకా పెరుగుతుంది.
ఇది 765 సీసీ కెపాసిటీ బైక్. 6 గేర్లు ఉంటాయి.
ఈ బైక్ బరువు 166 కేజీలు. ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ 17.4 లీటర్లు.
ఇక మైలేజీ అంటారా.. స్పోర్ట్స్ బైక్ కావడంతో మైలేజ్ గురించి మాట్లాడుకోవడం దండగ. కానీ, ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 13 నుంచి 15 కిలోమీటర్లు వస్తుందని వాడేవారు చెబుతారు.
బ్రిటన్ కంపెనీ..
ట్రయంప్ మోటార్ సైకిల్స్ అనేది ఇండియన్ కంపెనీ కాదు. బ్రిటన్ కంపెనీ. బ్రిటన్‌లో మోటార్ సైకిళ్ల కంపెనీలలో ఇదే టాప్.
ఇంగ్లాండ్‌లో కంటే థాయిలాండ్‌లో వీళ్లకు పెద్ద ప్రొడక్షన్ యూనిట్ ఉంది.
సెలబ్రిటీ బైక్..
ట్రయంఫ్ మోటార్ సైకిళ్లకు మాంచి క్రేజ్ ఉంది. చాలామంది సెలబ్రిటీల గ్యారేజ్‌లలో ఈ బైక్ కనిపిస్తుంది.
అడ్వంచరిస్ట్ Bear Grylls,
హాలీవుడ్ యాక్టర్లు David Beckham, Tom Cruise, George Clooney దగ్గర ట్రయంఫ్ బైక్‌లున్నాయి.
బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జామ్వాల్, జాన్ అబ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ వద్ద కూడా ఈ బైక్ ఉంది.