పొలిటిషియన్లకు, బ్యూరోక్రాట్లకు మధ్య ఎప్పుడూ అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. అయితే, కొందరు ఐఏఎస్ లు సర్దుకుపోతూ కెరీర్ లో ముందుకు పోతుంటారు. మరికొందరు మాత్ర ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పొలిటికల్ వార్ ను ఫేస్ చేస్తుంటారు. తాజాగా, కర్ణాటక బ్యాచ్ కు చెందిన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరికి, జేడీఎస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సారా మహేష్ ల మధ్య కొంతకాలంగా జరుగుతున్న వివాదం తారస్థాయికి చేరింది. దీంతో, సింధూరిపై మహేష్ రూ.100 రూపాయల పరువు నష్టం దావా వేయడం కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశమైందిజ
ప్రస్తుతం దేవాదాయ శాఖకు బదిలీ అయిన సింధూరి గతంలో మైసూరు జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. రోహిణికి, మహేష్ కు మధ్య ఏడెనిమిది నెలల నుంచి మాటల యుద్ధం నడుస్తోంది. చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 20మంది కరోనా రోగులు మృతి చెందడానికి సింధూరి కారణమని సారా మహేష్ ఆరోపించారు. అయితే, ఈ వ్యవహారంతో సింధూరికి సంబంధం లేదని తేలింది.
ఈ క్రమంలోనే వారిద్దరికి మధ్య వివాదం నడుస్తోంది. ఆ తర్వాత సారామహేష్కు చెందిన మ్యారేజ్ ఫంక్షన్ హాల్ రాజకాలువపై ఉందని జిల్లాధికారి ఒకరు ఆరోపించారు. అయితే, రెవెన్యూశాఖ పరిశీలనలలో ఈ వ్యవహారంలో అక్రమాలు జరగలేదని తేలింది. మరోవైపు, గత పదేళ్ళుగా సారా మహేశ్తో పాటు ఆయన భార్యకు చెందిన ఆస్తులను విచారణ జరపాలని మైసూరు అభివృద్ధి ప్రాధికారకు సింధూరి ఫిర్యాదు చేయడంతో వీరిద్దరి మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే సింధూరిపై మహేష్ పరువు నష్టం దావా వేశారు.