ఇద్దరి రక్త సంబంధీకుల మధ్య కచ్చితంగా, ఏవో ఒక మనస్పర్ధలు ఉంటాయి.
అలా అని ప్రేమ లేకుండా ఉండదు.
మనస్పర్ధలు లేవు,
మేము ఎంతో గొప్ప వాళ్ళం అని చెప్తున్నారు అంటే,
వాళ్ళు మనసు చంపుకుని,
ఎవరో కోసమో షో చేస్తూ బ్రతుకుతున్నారు అని అర్ధం.
నిన్న షర్మిల ఇంటర్వ్యూ లో,
ఇంతకు మించి ఏమి ఆశిస్తాం
అమ్మనా బూతులు తిడుతుందని, కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని అనుకున్నామా ?
Between the lines చెప్పాల్సినవి అన్నీ చాలా తెలివిగా చెప్పింది.
ముందుగా ఆర్కే తో
ఇంటర్వ్యూ ఇవ్వటమే,
జగన్ సగం చచ్చినట్టు.
వైసీపీ ఏబిఎన్ ని బ్యాన్ చేసింది, ఏపిలో రాకుండా చేసింది
మర్చిపో కూడదు.
దానికి తోడు, ఆర్కే ‘షమ్మీ’, ‘పాప్స్’
అని పిలవటం,
షర్మిల ఆర్కే ని ‘అన్నా’ ‘అన్న’
అని పిలవటం,
జగన్ కు ఎలా ఉంటుందో ఊహించుకోండి.
నోట్ : జగన్ ది విపరీత మనస్తత్వం, రెచ్చగొట్టటం కూడా ఒక ఆయుధం
1. రక్తసంబంధాన్ని కూడా పక్కన పెట్టి,
రాజకీయంగా మొదటి అడుగు వేసిన రోజే,
మాకు సంబంధం లేదని చెప్పించారు,
విబేధాలు ఉన్నా,
రక్త సంబంధం పక్కన పెట్టి,
సంబంధం లేదని చెప్పింది.
2. జగన్ కోసం ఎంతో చేశా,
వీళ్ళు సంబంధం లేదు అంటే బాధగా ఉందని సజ్జల పేరు చెప్పి మరీ చెప్పింది.
సజ్జల భారతి రెడ్డి మనిషి.
జగన్ మనిషి కాదు.
ఇక తరువాతది మీరే అర్ధం చేసుకోవాలి.
3. శక్తికి మించి కష్టపడ్డాను జగన్ కోసం అని చెప్పి,
తనను వాడుకుని వదిలేసారు,
అనే కదా, షర్మిల చెప్పిన అంశం ?
4. ఏపి విడిపోవటానికి వైఎస్ఆర్ కారణం అని చెప్పింది.
5. వైయస్సార్ చనిపోయినప్పుడు జగన్ సియం అవ్వటం కోసం సంతకాలు సేకరణ జరిగింది,
కాని జగన్ కాదట.
వీళ్ళ కుటుంబం తప్ప
ఎవరు చేస్తారు ?
6. జగన్ కోసం రాజకీయంగా అవసరం ఉన్నపుడు,
అడిగినవి అన్నీ నేను,
అమ్మ చేశాను.
ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు నా అవసరం లేదు కదా అని చెప్పటం ద్వారా,
అమ్మని, చెల్లిని జగన్ ఎలా వాడుకుని వదిలేసారో చెప్పింది
7. జగన్ జైలుకు వెళ్తే,
పార్టీకి ఎవరు సియం అవుతారో వాళ్ళ పార్టీ ఇష్టం అని చెప్పటం ద్వారా,
జగన్ కేసులు గురించి ఖండించ లేదు.
జగన్ జైలుకు వెళ్ళేది తధ్యం అని ఒప్పుకుంది.
8. షర్మిలకు రాజ్యసభ ఇస్తానని జగన్ మోసం చేసిన విషయం, పరోక్షంగా నవ్వుతూ ఒప్పుకుంది.
9. జగన్ తో ఆస్తుల గొడవలు
ఉన్నది నిజమే అని,
ఆస్తుల విషయంలో మోసం చేసారు అనే విధంగా మాట్లాడింది.
10. పులివెందులలోనే బాబాయ్ వివేకని చంపిన తీరు, అనుమానాస్పదంగానే ఉందని, తేడాగానే ఉందని,
సునీతకు అండగా ఉంటాం
అని చెప్పటం ద్వారా,
తాను చెప్పలానుకున్నది చెప్పింది. మనమే అర్ధం చేసుకోవాలి
11. బ్రదర్ అనిల్ లేకపోతే,
జగన్ రాజకీయ బ్రతుకు లేదు,
బ్రదర్ అనిల్ వల్లే, క్రీస్టియన్ ఓటు మొత్తం జగన్ కు పడిందని ఒప్పుకుంది.
ఇప్పుడు అనిల్ అడ్డం తిరిగితే పరిస్థితి ఏంటి,
అంటే ఒక నవ్వు నవ్వింది.
12. జగన్ రెడ్డి పాలన,
రాజశేఖర్ రెడ్డి పాలనలా లేదు
అని ఒప్పుకుంది.
13. స్థానిక సంస్థలు ఎన్నికలు, అధికారంలో ఉన్న వాళ్లకి అనుకూలంగా జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలు,
అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితేనే ప్రజల అభిప్రాయం ఉంటుందని,
జగన్ మొన్న స్థానిక ఎన్నికల గెలుపు గురించి అడగగా చెప్పింది.
14. రాజశేఖర్ రెడ్డి పుష్కర వర్ధంతికి,
జగన్ ని అమ్మ పలిచినా రాలేదని, చెప్పటం ద్వారా,
జగన్ ఎలాంటి వాడో చెప్పింది.
15. జగన్ రెడ్డికి ఓటు వేయమని అడిగాను,
ఇప్పుడు ఆయన చేసే పనులకు,
నన్ను అడిగితే నేనేమి చేయను ?
ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్
ఏమి ఉంటుంది ?
16. గంటన్నరలో ఎక్కడా జగన్ రెడ్డిని అన్న అని పిలవలేదు.
జగన్ మనస్తత్వం, సొంత కుటుంబాన్ని, అమ్మని చెల్లిని కూడా వాడుకుని వదిలేసినా విధానం, ప్రజలకు మంచి జగన్ చేయటం లేదు,
జగన్ జైలుకు వెళ్తాడు,
ఇలా అనేక విషయాలు చెప్పకనే చెప్పింది.