దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ లో కీలక నేతల అరెస్టులు.. మరికొందరి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. వంటివి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే.. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ లిక్కర్ స్కామ్‌లో చేతులు మారాయని భావిస్తున్న మొత్తం రూ.2 వేల కోట్ల కు పైగానే ఉంది. కానీ, ఇప్పుడు ఈడీ, సీబీఐల ఫోకస్ అంతా కూడా.. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇచ్చిన తీరుపైనే సాగుతోంది.
సరే.. ఈ కేసు ఎలా ముందుకు సాగింది.. ఏంటి? అనేది పక్కన పెడితే.. ఏపీలోనూ లిక్కర్ స్కీమ్ ఒకటి అమలవుతోంది. ఇక్కడ అమలవుతున్న స్కీమ్‌కు, ఢిల్లీలో వెలుగు చూసిన స్కామ్‌కు మధ్య రిలేషన్ ఏంటి? అసలు ఏపీ స్కీమ్‌కు, ఢిల్లీ స్కామ్‌కు మధ్య తేడాలేంటి? అనేవి ఆసక్తిగా మారాయి.
+ ఢిల్లీలో కొత్తగా తీసుకువచ్చిన లిక్కర్ విధానంలో ప్రభుత్వం పూర్తిగా మద్యం వ్యాపారం నుంచి తప్పుకోవాలని భావించింది. దీనిని ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుని.. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే వ్యూహంతోనే ఆప్ సర్కారు దీనిని రూపొందించింది.
+ అయితే.. అదేసమయంలో ప్రైవేటుకు మద్యం అప్పగించి.. తద్వారా.. లాభాలను లేదా.. విరాళాలను పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తరలించాలనే అప్రకటిత నిబంధనలు ఉన్నాయనేది సీబీఐ చేసిన ఆరోపణలు. ఇదే ఇప్పుడు ఆప్ సర్కారును ఇరకాటంలోకి నెట్టింది.
+ ముఖ్యంగా లిక్కర్ తయారీ కంపెనీలకు 6-12 శాతం మార్జిన్ పెంచుకుని విక్రయించుకునే వెసులు బాటు కల్పించింది. అదేసమయంలో ఢిల్లీలోని లిక్కర్ అమ్మే ప్రాంతాలను ఏకంగా 174 జోన్లుగా విభజించి.. వాటిని నేరుగా మద్యం తయారీ దారులకు విక్రయించేసింది.
+ మద్యం తయారీదారులు.. ఆయా జోన్లలో ఉన్న రిటైర్లకు మద్యాన్ని సరఫరా చేస్తారు. ఈ క్రమంలో.. రిటైల్ వ్యాపారుల నుంచి కాకుండా.. మద్యం తయారీ దారుల నుంచి నేరుగా ముడుపులు ఆప్‌కు వెళ్లాయనేది సీబీఐ ఆరోపణ.
+ ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయిస్తోంది. ఒక్క బార్లను మాత్రం ప్రైవేటు వారికి అప్పగించినా.. ఔట్లెట్లు, వైన్ దుకాణాలను మాత్రం ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
+ అదేసమయంలో ఏపీలో మద్య తయారీ కంపెనీలు మొత్తంగా(కొత్తవి) అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ ఏం జరుగుతోంది అనేది.. బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. నేరుగా బయటపడేలా.. ఎలాంటి ఆధారాలు లేవు.
+ అదేసమయంలో లిక్కర్‌పై మార్జిన్ అంటూ ఏమీ నిర్ణయించలేదు. కానీ, కంపెనీలు ఉత్పత్తిని బట్టి ధరలను నిర్ణయిస్తే.. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేసి.. ధరలు నిర్ణయించి విక్రయిస్తోంది.
+ ఇక, ఇక్కడ కూడా కంపెనీల నుంచే నేరుగా ముడుపులు అందుతున్నాయి. కానీ, వీరు వేరే వ్యక్తులు కాకపోవడం.. రాజకీయంగా ఇతర పార్టీలపై ప్రభావం చూపించేలా లేకపోవడంతో ఎలాంటి ఆరోపణలు లేకపోవడం గమనార్హం.
+ లిక్కర్ తయారీ వైసీపీ నేతల చేతుల్లో ఉంటే.. అమ్మకం వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడంతో అన్నీ సాఫీగా జరుగుతున్నాయనేది నిపుణుల మాట.