తనకు సంబంధం లేని, తన దగ్గర ఆధారం లేని దాని గురించి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని వైసీపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అబద్ధాలు ప్రచారం చేసి అధికారం లోకి వచ్చిన YCP నేటికి అబద్ధాలనే నమ్ముకుంది. తాజాగా కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు, మమత వ్యాఖ్యలను పట్టుకుని సారా మరణాలపై ప్రజల దృష్టి మరలించే ప్రయత్నం చేసింది వైసీపీ.
ఒక విషయం బయటకు వస్తే ఇంకో కొత్త వార్త సృష్టించి ప్రజలను మభ్యపెట్టడం మొదటి నుండి Ycp నేతలకు అలవాటే. .ఇపుడు జరుగుతున్న పెగాసేస్ కూడ అలాంటిదే. TDP ఆధారాలతో సహా చూపించింది ఆ సాఫ్ట్ వేర్ కొనలేదని. అసలు పెగాసెస్ వ్యవహారంపై టీడీపీకి, వైసీపీకి, బీజేపీకి ఉన్న సంబంధం… ఈ వీడియోల క్లియర్ గా తెలుసుకోవచ్చు.
అసలు దేశంలో పెగాసస్ అనేదాన్ని వాడుతున్నది మోడీ ప్రభుత్వం.
ఆ సాఫ్ట్ వేర్ వల్లనే కాంగ్రెస్ ని సర్వనాశనం చేసింది.
దీనిపై పార్లమెంట్ లో చర్చించమంటే బీజేపీ ససేమిరా అంటోంది
బీజేపీకి కసిరెడ్లందరూ వంత పాడుతూ పెగాసెస్ పై చర్చ అవసరం లేదు అన్నారు.
ఇపుడు చంద్రబాబు పేరు వచ్చే టప్పటికి చర్చ కావాలి అంటున్నారు… అది వైసీపీ తీరు.