15 సంవత్సరాల నుంచి బీజేపీ రాయలసీమలో హైకోర్టు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉంది. కానీ 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైకోర్టును ఎందుకు అమరావతిలో పెట్టింది.
సెక్రటేరియట్ లేదా ఇతర ఏ ఆఫీసు అయినా అమరావతిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత,అవకాశం ఉంటుంది. కానీ హైకోర్టు ఎక్కడ పెట్టాలన్నది కేవలం రాష్ట్రపతి, కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. మరి తాను అధికారంలో ఉన్నా, తన పార్టీ తరఫున నిలిచిన వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నా కూడా బీజేపీ ఎందుకు హైకోర్టును రాయలసీమలో పెట్టలేదు.
ఈ ప్రశ్నకు ఏపీ బీజేపీ నేతలు ఏం సమాధానం.
వారు ఏ సమాధానమూ చెప్పరు. వారు చేసేవి రెండే.
చంద్రబాబును తిట్టడం, జగన్ ని సేవ్ చేయడం.
హిందూయేతరుడు అయిన జగన్ అధికారంలో ఉంటేనే మత రాజకీయం చేసే బీజేపీకి అవకాశం వస్తుంది కనుక జగన్ ని సీఎం కుర్చీలో ఉండటానికి బీజేపీ సహకరిస్తూనే ఉంటుంది. ఇది బీజేపీ ఏపీలో బలపడేంతవరకు జరుగుతుంది.
అంతేగాని రాయలసీమపై గాని, ఆంధ్రాపై గాని, ఉత్తరాంధ్రపై గాని బీజేపీకి ఏ ప్రేమా ఉండదు. ఆ మాటలన్నీ బూటకాలే. వారికి పార్టీ తప్ప వేరే ప్రయారిటీ ఏమీ ఉండదు.
బీజేపీ, వైసీపీ చేసిన విష ప్రచారం వల్ల..నేడు రాయలసీమ ఏం కోల్పోయిందో తెలుసా..చంద్రబాబును కాదు..ప్రపంచపు ప్రతిష్టాత్మక కంపెనీ Tesla ను కోల్పోయింది.
చంద్రబాబు చేసిన ప్రయత్నాలతో దక్షిణ భారతంపై అది కూడా ఆంధ్రాపై ఆసక్తి చూపిన టెస్లా..కొరియా జెయింట్ కియాకు జరిగిన అవమానాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా పై తన ప్రేమను చంపేసుకుంది.దీంతో #రాయలసీమ ‘‘టెస్లా’’ను మిస్సయ్యింది.
మరి రాయలసీమ ఉద్యమకారులు, రాయలసీమ ప్రజలు, రాయలసీమమిత్రులు మీకు అర్థమవుతుందా?
ఆంధ్రాకి ప్రామిస్ చేసిన కంపెనీ బెంగుళూరుకు ఎందుకు పోయిందో అర్థమవుతుందా?
చంద్రబాబు నాయకులను ప్రేమగా పలకరించరు
చంద్రబాబు సెంటిమెంట్ పండించరు
చంద్రబాబు ప్రేమగా పలకరించారు
అవును ఇదంతా నిజమే..చంద్రబాబుకు సెంటిమెంట్ రాజకీయం తెలియదు. కానీ కంపెనీలను ఒప్పించి ఆంధ్రాకు తేవడం తెలుసు కదా.
మరి అది చాలుకదా..
ఇంత చిన్న లాజిక్ కనిపెట్టలేక టెస్లాను మిస్సయ్యాం..ఎన్నో కోల్పోయాం..పోనీ చంద్రబాబు ఓడిపోతే ఓడిపోయాడు..ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ని ఏమయ్యా మాకు కంపెనీలు తేలేవా, టెస్లాను పట్టుకురాలేవా..రాయలసీమను ఎందుకు ఎండబెడతావు? అని ప్రశ్నించరేం.
రాయలసీమ అభివృద్ధి లేకపోయినా పర్లేదు జగన్ సీఎంగా ఉంటే చాలా?
రాయలసీమ వెనుకబడినా పర్లేదు పులివెందులకు వేల కోట్లు ఇస్తే చాలా?