రామోజీ రావు ఇకలేరు.. ఇది భౌతికం. ఆయన ఉంటారు.. ఇది `అక్షర` సత్యం. ఈనాడు ఉన్నంత కాలం .. ఆయన ప్రజలను పలికరిస్తూనే ఉంటారు. తెలుగు నేల, తెలుగు ప్రజలతో ఆయన పెనవేసుకున్న బం ధం అలాంటిది. అయితే.. ఈ బంధం కంటే కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రామోజీకి ఉన్న బంధం ప్రత్యేకమైంది. రాజకీయంగా.. వ్యక్తిగతంగా పాలన పరంగా కూడా చంద్రబాబుకు-రామోజీకి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
తొలి నాళ్లలో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సంపూర్ణ సహకారం అందించింది.. రామోజీరావే. పాలన వ్యవహా రాలు.. చంద్రబాబు విజన్ వంటివాటిని కూడా.. ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకవచ్చింది కూడా.. రామో జీరావే. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టడం వెనుక.. రామోజీ పాత్ర ఉంది. ఆయన అభిలాష మేరకు.. సుజలాం.. సుఫలాం..ఇంకుడు గుంతలు.. వంటి కార్యక్రమాలను 1995-98 మధ్య చంద్రబాబు అమలు చేశారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కూడా చంద్రబాబుకు రామోజీ వెన్నంటి ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలను లోతుగా విశ్లేషించిన పత్రిక కూడా.. ఈనాడే. అంతేకాదు..లోటు పాట్లను కూడా నిర్మొహమాటంగా చర్చించింది కూడా.. ఈ పత్రికే. తద్వారా చంద్రబాబు తనను తాను మార్చుకునేందుకు రామోజీ ఎంతో కృషి చేశారు. ఇక, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును సూచించిన దరిమిలా.. ఇక్కడి రైతులు భూములు ఇచ్చేలా ప్రోత్సహించింది కూడా.. ఈనాడే.
ఇక, సమాజంలో ఉన్న చెడురుగ్మతలను ఈనాడు ద్వారా వెలికి తీసి.. తక్షణ చర్యలు తీసుకునేలా చంద్ర బాబుపై ఒత్తిడి తెచ్చింది కూడా.. రామోజీనే. అంతేకాదు.. అసెంబ్లీలో విపక్షం వైసీపీ చేసిన యాగీని.. అనే క సందర్భాల్లో దునుమాడి.. సర్కారుకు మద్దతుగా నిలిచింది. ఇలా.. ఒక సందర్భం కాదు… అనేక సందర్భాల్లోనూ.. అనునిత్యం వెన్నంటి ఉన్నారు రామోజీ. ఇక, చంద్రబాబు హయాంలోనే రామోజీ కల సాకారం అయిది. ఆయన నిర్మించాలని అనుకున్న రామోజీ ఫిలిం సిటీకి భూములు ఇచ్చింది బాబు హయాంలో నే . ఇలా.. వీరి మధ్య బంధం దృఢంగా మారింది.