రీల్ సీన్ కాదు రియల్ సీన్. కరోనా కారణంగా చోటు చేసుకుంటున్న సిత్రాలకు ఇదో ఉదాహరణ. రేపు(మంగళవారం) ఒక యువ జంట పెళ్లి తమిళనాడులోని మధురైలో జరగాల్సి ఉంది.
ఈ వేడుకకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి మధురైకి పెళ్లికొడుకు.. పెళ్లి కుమార్తెతో పాటు.. రెండు కుటుంబాల వారు విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో వారు తీసుకున్న నిర్ణయం.. విమానంలోనే పెళ్లి చేసుకునేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ విమానంలో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్న వివరంలోకి వెళితే..
పెళ్లి చసుకునేందుకు బెంగళూరు నుంచి మధురైకు బయలుదేరారు రాకేశ్.. దక్షిణలు. వారిద్దరి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. విమానం ఎక్కిన తర్వాత.. మంగళవారం నుంచి తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తారన్న సమాచారం అందింది. దీంతో.. పెళ్లి కోసం మధురైకి వెళ్లి పెళ్లి చేసుకోవటం సాధ్యం కాకపోవటంతో.. పెళ్లి ఏర్పాట్లను కేన్సిల్ చేశారు.
అనూహ్యంగా విమానంలోనే పెళ్లికొడుకు.. పెళ్లి కుమార్తె వివాహ వేడుకనుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిపించేశారు. యువ జంటకు ఇరు వర్గాల వారు ఆశీర్వచనం ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. కొవిడ్ సీజన్ పూర్తయ్యే వరకు ఇలాంటి సిత్రాల్ని మరెన్నింటిని చూస్తామో?
Rakesh-Dakshina from Madurai, who rented a plane for two hours and got married in the wedding sky. Family members who flew from Madurai to Bangalore after getting married by SpiceJet flight from Bangalore to Madurai. #COVID19India #lockdown @TV9Telugu #weddingrestrictions pic.twitter.com/9nDyn3MM4n
— DONTHU RAMESH (@DonthuRamesh) May 23, 2021