వైసీపీ ఎంపీ, ఢిల్లీలో తెలుగు వారి పరువు మర్యాదలను అధికార పార్టీ చేష్టల వల్ల పోకుండా కాపాడుతున్న రఘు రామకృష్ణ రాజుకు ఈరోజు బైపాస్ సర్జరీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా. ముంబైలోని ఆసియా హార్ట్ ఇనిస్టిట్యూట్లో పద్మభూషణ్ డాక్టర్ రామకాంత పాండా గారు ఈ సర్జరీ చేశారు.
తాను ప్రతినిత్యం స్మరించే శ్రీ వెంకటేశ్వరస్వామి దయవల్ల అత్యంత సాఫీగా శస్త్రచికిత్స పూర్తి అయినట్టు రాజు వెల్లడించారు. మహాశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకపూర్ణమి రోజున ఆ శివుడి ఆశీసుస్సలతో ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని రాజుగారు సంతోషం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. 2 రోజులు ఐసియులో ఉంటారు. అనంతరం సాధారణ గదికి మారుస్తారు. దేవుడి ఆశీస్సులతో పాటు తన శ్రేయోభిలాషుల ప్రార్థనలు ఫలించాయని, వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.