రఘురామకృష్ణరాజు గుండె శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. తాజాగా ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. ముంబైలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నానని, ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు వీడియో విడుదల చేశారు.
ఇటీవల ముంబైలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాను. ఈ సందర్భంగా నేను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్దించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. pic.twitter.com/fictRP5wSB
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) December 16, 2020
విన్నారుగా ఆయన సందేశం. 4 వారాలు పాటు ఆయన స్పందన మనకు పెద్దగా వినిపించకపోవచ్చు. ఆ తర్వాత మళ్లీ రచ్చ రచ్చే.