కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ.. ఆసక్తికర కామెంట్లు చేశారు. వైసీపీపై పోరాటం చేసేందుకు ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. ముప్పేట దాడికి రెడీ అవుతున్నట్టు చెప్పారు.
ఇంత వరకు ఓకే.. ఇదే బీజేపీ నేతలు.. అభిమానులు కూడా కోరుకుంటోంది. ఎక్కడో `లాలూచీ` పడ్డారనే వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు.. పార్టీ నేతలు. అబిమానులు అందరూ స్వాగతించేవే. అయితే.. పనిలో పనిగా చిన్నమ్మ ఓ మాట అనేశారు.
అదేంటంటే.. వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలని. సరే.. ఇది ఆమె ఎలా అన్నారో తెలియదు కానీ.. ఈ విమర్శపైనే అందరూ విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. వాటి సంగతి పక్కన పెడితే.. పురందేశ్వరి కుటుంబంలోనే ఇద్దరు నేతలు.. రాజకీయాలు చేస్తున్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు.
గతంలో కాంగ్రెస్‌లోనూ తిరిగారు. తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత.. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ నష్టపోవడంతో ముందు చూపుతో బీజేపీ పంచన చేరిపోయారు. ఇక, ఇదే కుటుంబంలో పురందేశ్వరి భర్త.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీలో ఉన్నారు.
ఔను! ఆయన వైసీపీలోనే ఉన్నారు. ఎందుకంటే.. ఆయన పార్టీకి రిజైన్ చేయలేదు. పార్టీకూడా ఆయనను వదిలించుకోలేదు. పైగా పరుచూరులో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. దగ్గుబాటి అనుచరులే ఇటీవల చెప్పుకొ చ్చారు.
అంటే.. పురందేశ్వరి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమైతే.. ముందుగా.. ఆ కుటుంబంలో ఉన్నవారి గురించి మాట్లాడి.. తర్వాత ఇలాంటి విమర్శలు చేయాలి. లేకపోతే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ పార్టీలోనూ లేరనైనా చెప్పి.. ఆ తర్వాత.. ఇతర పార్టీలను విమర్శించాలి.
కానీ, పురందేశ్వరి మాత్రం.. తప్పులెన్నేపనిలో ఉండి.. తమ తప్పు తెలుసుకోవడం లేదు. ఇక, టీడీపీ కుటుంబం పార్టీ ఎలా అయింది? అనేది కీలక ప్రశ్న. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అయినా. కుటుంబ సభ్యులు అంటే.. ముందుగా పురందేశ్వరి తమ్ముడు, చంద్రబాబు బావమరిది.. బాలయ్యే ముందుకు వస్తారు.
ఆయనను ప్రజలు గెలిపించారు. సో.. ప్రజలు అంగీకరించినప్పుడు.. అది కుటుంబ పార్టీ ఎలా అవుతుందో.. ఆమె చెప్పాలి. ఏదేమైనా.. పురందేశ్వరి మాటల మర్మం.. ఏంటో.. తెలియదు కానీ.. మైకు దొరికిందని.. వాస్తవాలు మరిచిపోయి మాట్లాడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.