ఈ రోజు అమరావతిలో చంద్రబాబు గారికి సంఘీభావంగా ముస్లిం మహిళలు ర్యాలీ తీశారు. దీనికి అందరూ హాజరు అయ్యారు.
ర్యాలీ తలపెట్టిన మార్గం గుండా పోలీసులను పెట్టారు జగన్. కానీ ర్యాలీ మొదలు అయినప్పటి నుంచి పోలీసులు ర్యాలీని ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా ప్రజలు వినలేదు. మొండిగా ముందుకు వెళ్లారు.
వేలాది మంది పోలీసులు చేరుకొని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారి నిర్బంధాన్ని తట్టుకుంటూ.. ఆఖరికి పోలీసులను సైతం ఆ ర్యాలీతో పాటే.. వాళ్ళు అనుకున్న ప్రాంతం వరకు తీసుకురాగలిగారు. ఇది స్పష్టంగా ప్రజల్లో వచ్చిన మార్పుని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బాధించాడో ఈ ప్రతిఘటన చూస్తేనే అర్ధమవ్వాలి పోలీసులకు కూడా అని తెలుగుదేశం జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు !
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు – ముస్లిం మహిళలతో భారీ నిరసన
ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు, అమరావతిలో భారీగా పోలీసుల మోహరింపు – ర్యాలీ నిర్వహిస్తామని పట్టుబడుతున్న టీడీపీ నాయకులు – మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను 14వ మైలు దగ్గర అడ్డుకున్న పోలీసులు @APPOLICE100 pic.twitter.com/0EINAEV8jC
— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) October 1, 2023