ప్రపంచంలోని అత్యంత హైప్రొఫైల్ విడాకుల కేసుల్లో ఇదొకటి. నిన్న లండన్ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది.
దుబాయికి రాజు, అరబ్ ఎమిరేట్స్‌కు ప్రధాన మంత్రి అయిన మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మఖ్తూం.. ఆయన ఆరో భార్య ప్రిన్స్ హయా మధ్య విడాకుల కేసు.
ప్రిన్స్ హయాకు 5.5 కోట్ల పౌండ్లు అంటే… ఇండియన్ కరెన్సీలో పరిహారం ఇవ్వాలని దుబాయి రాజుకు కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. లండన్‌లో ఆమెకు ఉన్న రెండు భారీ ప్యాలస్‌ల మెంటెనెన్స్, ఆమె ఇద్దరు పిల్లల మెంటెయినెన్స్.. హయా, ఆమె పిల్లల సెక్యూరిటీ, వారి సిబ్బంది జీతాలు, గుర్రాలు ఇతర పెంపుడు జంతువుల పోషణ… ఒకటేమిటి సమస్తం దుబయి రాజు బాద్యతే అని కోర్టు తేల్చి చెప్పేసింది.
సింపుల్‌గా చెప్పాలంటే సంసారం ఒక్కటే ఉండదు కాదు సమస్తం ఈ మాజీ భర్తదే బాధ్యత.
ఇంతకీ ప్రిన్సెస్ హయా ఎవరు?
ప్రిన్సెస్ హయా కూడా సాధారణ మహిళ కాదు. జోర్డాన్ రాజు కూతురు. చిన్నప్పటి నుంచి రాజభవనాలలో పెరిగి, హైఫై లైఫ్ గడిపిన మహిళ. ఆమెకు గుర్రపు స్వారీ అంటే మహా మోజు. 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో కూడా ఆమె జోర్డాన్ తరఫున పాల్గొన్నారు.
అసలే రాజకుమారి… ఆపై మహా అందగత్తె. ఇంకేముంది దుబయి రాజు ఆమెపై మనసు పడ్డారు. దాంతో ఇద్దరికీ పెళ్లయింది. అప్పటికి ప్రిన్సెస్ హయా మంచి యవ్వనవతి కాగా.. రాజు అప్పటికే రిటైర్మెంట్ ఏజ్‌లో ఉన్నారు.
ఆ తరువాత రాణికి రాజుతో ఇద్దరు పిల్లలు కలిగారు.
బాడీగార్డుతో ఎఫైర్..
ప్రిన్సెస్ హయాకు ఆమె బాడీగార్డుతో ఎఫైర్ ఉందన్నది రాజు అనుమానం. అది నిజమని కూడా తేలింది. ఈ ఎఫైర్ గురించి బయటపెడతామని మిగతా బాడీగార్డులు, సెక్యూరిటీ స్టాఫ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె వారికి లక్షల డాలర్లు సమర్పించుకుంది కూడా.
మొత్తానికి ఈ గొడవలన్నీ జరుగుతుండగా రాణి తన ప్రాణాలకు ముప్పు వస్తుందని గుర్తించి దుబయి నుంచి లండన్ ఎస్కేప్ అయిపోయి అక్కడ కోర్టులో కేసు వేశారు.
తనకు, తన పిల్లలకు తన భర్త అయిన దుబయి రాజు నుంచి ముప్పు ఉందని ఆమె కోర్టును ఆశ్రయించారు.
ఈలోగా రాజుగారు రాణిని బెదిరించేలా కవితలు కూడా రాశారు. హయా ఫోన్లను ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్ పెగాసస్ తో రాజు హ్యాక్ చేశారన్న ఆరోపణలున్నాయి. లండన్ కోర్టు కూడా ఇది నిజమేనని తేల్చింది.
మొత్తానికి అనేక మలుపులు తరువాత తాజాగా ఆమెకు విడాకులు ఇప్పిస్తూ, భారీ పరిహారం ఇప్పిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
హయాకు, ఆమె పిల్లలకు ఏం జరిగినా అది దుబయి రాజు బాధ్యతేనని కూడా కోర్టు చెప్పింది.
- Parvati nair : అప్పుడేమో ముద్దులకు భయపడి, ఇపుడు అన్నీ విప్పేస్తోంది
- నిధి అగర్వాల్ మళ్లీ టాపు లేపిందిగా !!
దుబాయి రాజు ముసలోడే కానీ
ఇక దుబాయి రాజు మొహమ్మద్ బిన్ సంగతికొస్తే ఆయన మామూలోడు కాదు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకు హయా ఆరో భార్య. ఇంకా లెక్కలో లేని భార్యలు మరికొందరు ఉన్నారని చెబుతురు. మొత్తం పిల్లలు 30 మంది.
ఆయన కూతుళ్లలో ఒకరిద్దరు ఆయన్నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఆ వివాదాలూ ఉన్నాయి.
ఆయన కుమార్తె లతీఫా దుబయి నుంచి పారిపోయారు. రాజు ఇంట్లో ఆంక్షలు భరించలేనంటూ ఆమె బయటకొచ్చారు. ఆమె ముంబయి చేరుకుంటే భారత్ తిరిగి ఆమెను రాజుకు అప్పగించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ తరువాత ఆమె మళ్లీ పారిపోయి ఐరోపాలో ఉన్నట్లు చెబుతారు.
Read Also: