https://twitter.com/ANI/status/1608657708382826498
ఈ రోజు(శుక్రవారం) తెల్లవారు జామున అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్(100) అంత్యక్రియలు ముగిశాయి. ఆసుపత్రిలో ఆమె కన్నుమూసిన వెంటనే పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. అప్పటికే హీరా బెన్ పార్థివ దేహాన్ని ఆమె కుమారుడు పంకజ్ మోడీ ఇంటికి తరలించారు.
అక్కడే మోడీ తన మాతృమూర్తికి పుష్పగుచ్ఛాలు ఉంచి.. నివాళులర్పించారు. ఈశ్వర చరణాల చెంతకు తన మాతృమూర్తి చేరుకున్నారని.. శత వసంతాలు పూర్తి చేసుకున్న తన మాతృమూర్తి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని పేర్కొన్నారు. అనంతరం.. ఆమె అంతమ యాత్ర ప్రారంభించారు. ఉదయం 7.30 నిమిషాలకే అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మాతృమూర్తి పాడెను స్వయం మోసిన ప్రధాని అంతిమ యాత్ర వాహనం వరకు తీసుకువచ్చారు.
అనంతరం, అహ్మదాబాద్‌లోని మనిసిపల్ క్రిమిటోరియంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ అంత్యక్రియలకు సమీప బంధువులు హాజరయ్యారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం సాధారణ మరణం చెందిన వారి పార్థివ దేహాలకు 5 గంటలలోగానే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇదే సంప్రదాయం ప్రకారం మోడీ మాతృమూర్తి అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా, హీరాబెన్ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానాలోని వాద్నగర్. ఆమె మోద్-ఘంచి కమ్యూనిటీ(ఓబిసి) కి చెందినది. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ టీ వ్యాపారి. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు సోమ మోదీ ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారి, పంకజ్ మోదీ, గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్, అమృత్ మోదీ, రిటైర్డ్ లేత్ మెషిన్ ఆపరేటర్, ప్రహ్లాద్ మోదీ వ్యాపారం, ఆమెకు 3వ సంతానంగా నరేంద్ర మోడీ జన్మించారు. ఈయన భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్నారు.
Om Shanti pic.twitter.com/pOvdP81WX5
— Shefali Vaidya. ???????? (@ShefVaidya) December 30, 2022