ప్రస్తుతంఈ 17 నెలల కాలంలో ఉద్యోగులసమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నతీరు పై ప్రభుత్వ ఉద్యోగుల్లోతీవ్ర అసంతృప్తి ఉందని పలు ప్రైవేట్ సంస్థలుచేసిన సర్వే లో తేలింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మొత్తం 36785 మంది ని పలుప్రశ్నలు తో ఈ సర్వేనిర్వహించారు . వారి సమస్యల పరిస్కారంపట్ల మరియు వారికీ
ప్రభుత్వం చేకూర్చిన ఆర్థిక పరమైన అంశాల పై ఇలాంటి కొన్నిరకాల ప్రశ్నలు సర్వే లో సంధించారు .
మొత్తం36785 మంది సర్వే లో పాల్గొనగా 30532(83 శాతం ) మంది ప్రభుత్వం తీరుపైతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.
5150మందిఅంటే 14 శాతం మాత్రమే ప్రభుత్వతీరుపై సంతృప్తి వ్యక్తం చేసారు .
మిగిలిన1103 మంది అంటే 3 శాతం మంది తటస్థ వైఖరి అవలంబించారు .
17నెలలకాలంలోనే ప్రభుత్వ తీరు పై తీవ్రఅసంతృప్తి రావడానికి కారణాలు వ్యక్తం చేసారు.
1.అధికారంలోకివచ్చిన వారంలోపే సిపియస్ రద్దు చేస్తామన్నారు .ఇప్పుడు అధికారం లోకి వచ్చి 17 నెలలుపూర్తి అయినా సిపియస్ రద్దు చేయలేదని చాలా మంది అసంతృప్తివ్యక్తం చేసారు .
2.ఎన్నికలముందుసకాలంలోనే DA లు ఇస్తామన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్ర లో ఎప్పుడూ లేనివిదంగా 5 DA లు పెండింగ్ లోఉంచారు .
3.గతంలో కంటే మెరుగైన PRC ఇస్తామన్నారు.10 PRC గడువు ముగిసి 27 నెలలు పూర్తి అయినా 11 వ PRC అమలు చేయలేదని అసంతృప్తివ్యక్తం చేసారు.
4.క్షేత్రస్థాయిలో గతంలో ఎన్నడూ లేని విదంగా ప్రభుత్వఉద్యోగుల పై దాడులు,దౌర్జన్యాలుజరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసారు .
5.సమస్యలపైప్రాతినిధ్యం చేయడానికి ఈ 17 నెలల కాలంలోఉపాధ్యాయ సంఘాలకు CM గారు ఒక్క అప్పోయింట్మెంట్కూడా ఇవ్వకపోవడం పలు ఉపాధ్యాయ సంఘనాయకులూ అసంతృప్తి వ్యక్తం చేసారు .
గతంలోఎప్పుడూ ఈ పరిస్థితి ఉపాధ్యాయసంఘాలకు లేదని అసంతృప్తితో వున్నారు .ఇలాంటి కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో 83 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని సర్వే సంస్థలు తెలిపాయి .