నటుడు ప్రకాష్ రాజ్ తన మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (MAA) ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రత్యర్థి అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రకాష్ రాజ్ వాటిని కొట్టి పారేశారు. MAA అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, ప్రకాష్ రాజ్ పూర్తిగా నిరాశ చెందినట్లు కనిపిస్తోంది.
మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం పెట్టారు. ఆయనతో పాటు ఆయన ప్యానెల్ వాళ్లంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కళాకారుల ఎన్నికల్లో ‘ప్రాంతీయ’ భావాలను తీసుకురావడం అన్యాయమని ప్రకాష్ రాజ్ అన్నాడు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేశారు. ‘మా’ సంక్షేమం కోసం.. మా ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నాం. కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచనే లేదు.. ఆత్మ, పరమాత్మ అలాంటి ఆలోచనలేలేవు అని ప్రకాష్‌రాజ్ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు విజయం సాధించారు. MAA ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్, తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ మీటింగ్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన పలువురు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలి. తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంది అని మంచు విష్ణు హామీ ఇస్తే నా రాజీనామా వెనక్కి తీసుకుంటా
-ప్రకాష్‌రాజ్
నరేష్ నన్ను ముఠా నాయకుడు అని అన్నారు. అయినా మౌనంగా ఉన్నాను. నేను గెలిచినా సంతోషం లేదు. ఎన్నికల రోజు మోహన్ బాబు తిడుతున్నారు, మోహన్ బాబు కొట్టడానికి వచ్చారు, పచ్చి బూతులు తిట్టారు, అరగంట సేపు తిట్టారు.. డీఆర్సీ పెద్దమనిషి గొడవ జరిగితే ఆపాలి.. కానీ, ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదు
-బెనర్జీ
నటుడు నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు. మేము తప్పు చేశాం అనుకున్నా పర్లేదు. కానీ మేము కొనసాగలేం. ఇప్పుడే తప్పుకుంటాం
-శ్రీకాంత్
https://www.youtube.com/watch?v=35zfmOQ9GSo&ab_channel=TV5News