• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోదీ నుంచి చంద్రబాబు వరకు అంతా ‘నాటు’ మేనియా

admin by admin
March 13, 2023
in Movies, Top Stories
0
0
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రస్తుతం ప్రపంచమంతా నాటు నాటు మేనియా నడుస్తోంది. ఆ పాటకు ఆస్కార్ దక్కడంతో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా నాటు నాటు స్టెప్పులేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు ప్రధాని నరేంద్ర మోదీ మొదలు టీడీపీ అధినేత చంద్రబాబు వరకు పలువురు రాజకీయ ప్రముఖులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. విజనరీ డైరెక్టర్ రాజమౌళితోపాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఈ విజయాన్ని ‘అసాధారణమైనది’గా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉందని, ఇది రాబోయే సంవత్సరాలకు గుర్తుండిపోయే పాటగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఇక, ఆస్కార్‌లో రెండో విజయం సాధించినందుకు డాక్యుమెంటరీ చిత్రనిర్మాతలు కార్తికి గోన్సాల్వేస్, గునీత్ మోంగాలను కూడా అభినందించారు. వారి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. “వారి పని సుస్థిర అభివృద్ధి, ప్రకృతికి అనుగుణంగా జీవించడం ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేస్తుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్ని ఇవ్వడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

తెలుగుజెండా ఎగురుతోందని, మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా ‘నాటునాటు’ పాట చరిత్రలో నిలిచిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని… ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

Tags: ChandrababucongratsJagannaatu naatu songoscar awardpm modi
Previous Post

ఆస్కార్ తర్వాత కీర‌వాణి ఫస్ట్ రియాక్ష‌న్ వైరల్

Next Post

రాజమౌళి, జూ.ఎన్టీఆర్, చరణ్ లను ఇలా ఎప్పుడైనా చూశారా?

Related Posts

Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

ఇకనైనా కొమ్మినేని మారతారా?

June 17, 2025
Andhra

చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?

June 17, 2025
Load More
Next Post

రాజమౌళి, జూ.ఎన్టీఆర్, చరణ్ లను ఇలా ఎప్పుడైనా చూశారా?

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra