వైసీపీ నేతల మాటలు వింటే కామన్ మాన్ కి మండిపోతుంటుంది. జనాలు గొర్రెలు. వారు ఏ వార్తలు చదవరు. చదివినా అర్థం కాదు అనుకుంటారో ఏమో… ప్రతిదానికీ తమదైన వెర్షన్ చెబుతుంటారు. తాము చెప్పింది జనానికి వేదం అని, తాము ఏం చెప్పినా జనం నమ్ముతారని వారి భ్రమ కావచ్చు. తాజాగా వైసీపీ నేత రోజా రెడ్డి స్పందన చూస్తే ఇలాగే ఉంది.
నగరిలో చేనేతే కార్మికులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ధర్నా చేశారు. తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రోజా కాబట్టి ఆమె ఇంటికి నిరసనగా వెళ్లి తమ ఆవేదన తెలియజేశారు. తమ గోడును నిరసన ద్వారా జనానికి తెలియజేశారు. తాము ఎన్ని బాధలుపడుతున్నది మీడియాకు వివరించారు.
అయితే, రోజా అపుడు ఇంట్లో లేరు. మరి ఆమె హైదరాబాదులో జబర్దస్త్ షూటింగులో ఉండి ఉండొచ్చు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. సహజంగా అయితే, మీ ఇబ్బందులు అర్థం చేసుకున్నాను. సీఎం జగన్ రెడ్డి తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పాలి. కానీ అలా చెబితే ఆమె వైసీపీ నేత ఎందుకవుతుంది.
మీరు అడిగిన సమస్య నా పరిధిలోని అంశం కాదు, అది రాష్ట్రంలో అంతటా ఉన్న సమస్య. మీరు మా ఇంటికి వచ్చి నన్ను అడిగితే నేనేం చేయగలను. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు పరిష్కరించగలిగిన సమస్యను మీరు నన్ను అడిగితే నేను ఏమీ చేయలేను. ఈ విషయం తెలిసి టీడీపీ వాళ్లు నా మీదకు జనాన్ని ఉసిగొల్పారు. = రోజారెడ్డి, నగరి ఎమ్మెల్యే
ఇది ఎంత అవివేకమైన సమాధానమో చూశారా? రోజా రెడ్డి వంటి ఎమ్మెల్యేలు అందరూ అంగీకరిస్తేనే సీఎం పదవి ఉంటుంది. అసలు జనం ఓటేసింది జగన్ కి కాదు, నగరి ప్రజలు రోజాకి, శ్రీకాళహస్తి నియోజకప్రజలు బియ్యపు మధుసూపర్ రెడ్డికి ఇలా తమ ఎమ్మెల్యేకే ఓటువేస్తారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. అంతేగాని అది నా పరిధిలోని సమస్య కాదు అని వెర్రి సమాధానం చెప్పడం ఏంటో. మరీ జనం అంత అమాయకులేం కాదు. నా పరిధిలోనిది కాదు అంటే నమ్మేయడానికి. ఆ మాటకు వస్తే గ్రామంలో మురుగు నీరు సమస్య కూడా ముఖ్యమంత్రి పరిధిలోకే వచ్చేది. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటిని నిధులు సాధించుకుని పరిష్కరించాల్సిన సమస్య ఎమ్మెల్యేదే.